అంధ్రప్రభ స్మార్ట్ – కర్నూలు న్యూస్ బ్యూరో – ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది.. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 4.37 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.. మరోవైపు.. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో.. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటికే 62,725 క్యూసెక్కుల నీటిని వాడుతూ దిగువకు విడుదల చేస్తున్నారు.. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 877.80 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 171.8625 టీఎంసీలకు పైగా ఉంది.. సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 880 అడుగులకు చేరువగా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ రోజే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేటి సాయంత్రం శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేయనున్నట్టు ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.. ఇప్పటికే జలాశయానికి గంటగంటకు పెరుగుతోంది వరదప్రవాహం.. ఓవైపు కృష్ణా నది, మరోవైపు తుంగభద్ర రివర్ నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి శ్రీశైలంలో చేరుతోంది.. దీంతో సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం జలాశయం రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని వదలనున్నారు అధికారులు మొదట నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు..