Monday, November 18, 2024

3 Gates Lifted – శ్రీశైలం రిజ‌ర్వాయ‌ర్ మూడు గేట్లు ఎత్తివేత .. వీడియోతో

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – క‌ర్నూలు బ్యూరో – కృష్ణ ,తుంగభద్ర పొంగి పొర్లడంతో శ్రీశైల జలాశయం నిండుకుంది. జలాశయం పూర్తిస్థాయి 885 అడుగుల గాను ప్రస్తుతం 878 అడుగులుగా ఉంది. ఇక జలాశయం నీటి మట్టం 215 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 180 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయం కు 4.67 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది.దీంతో గంట గంటకు ప్రాజెక్టులో నీటి నిల్వలో పెరగడం, గంటకు ఒక టీఎంసీ చొప్పున డ్యాంకు చేరుతుండడంతో ఏ క్షణమైన శ్రీశైలం జలాశయ నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగా ఎగువ అలమట్టి, నారాయణపూర్, జూరాల నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహంతో పాటు, ఇటు తుంగభద్ర జలాశయం, సుంకేసుల బ్యారేజ్ నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని లెక్క కట్టిన అధికారులు కనిష్ట స్థాయిలో శ్రీశైలం డ్యాం లో నీటిని నిలువ చేశారు.

ఎగువ నుంచి భారీ ప్రవాహం ఉన్న నీటిని దిగవకు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ఇరిగేషన్ సిఇ కబీర్ , డ్యామ్ కు చెందిన మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. డ్యాంలో 4లక్షల 67వేల 210 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు సమాచారం. 6, 7, 8వ గేట్లను కూడా ఎత్తారు. ఒక్కో గేటు నుండి 27వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందని సీఈ కబీర్ వెల్లడించారు .


కాగా.. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్నారన్న సమాచారంతో సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు భారీగా చేరుకున్నారు.. డ్యాం వద్ద నీటి విడుదల, వాటి పరవళ్లను చూస్తూ ఎంజాయ్ చేశారు.

- Advertisement -

Liquor Scam – కేజ్రీవాల్ బెయిల్ పై తీర్పు రిజర్వ్

Advertisement

తాజా వార్తలు

Advertisement