Friday, November 22, 2024

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఎగువ కృష్ణా,తుంగభద్ర నుంచి నీటి ప్రవాహం శ్రీశైల జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను, వరద ప్రవాహం తో 884.80అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ  సామర్థ్యం 215 టిఎంసిలు ఉండగా.. ప్రస్తుతం 214.3637 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 81,664  క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది. ఇందులో జూరాల నుంచి 8,351 క్యూసెక్కులు, సుంకేసుల బ్యారేజీ నుంచి 43,450  క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. కృష్ణా , తుంగభద్రల నుంచి 51,801 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది.

మొత్తంగా శ్రీశైలం డ్యామ్ కు 81664 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఎగువ నుంచి ఉంది.  ఇక ప్రాజెక్టు నుంచి తెలంగాణ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన నిమిత్తం 35,315 క్యూసెక్కులు, ఏపీ పరిధిలోని కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,968 క్యూసెక్కుల నీటిని  శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు వెళ్తుంది.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement