Monday, November 25, 2024

Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టు – 10గేట్లు ఎత్తివేత

కర్నూలు బ్యూరో : శ్రీశైల జలాశయంకి వరద పోటెత్తుతోంది. ఎగువ కర్ణాటకలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఫలితంగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ఈ డ్యామ్ లో కనిష్ట స్థాయిలో నీటి నిలువలు ఉంచుకొని వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి పరవళ్ళు తొక్కుతూ కృష్ణా జలాలు జూరాల చేరుతున్నాయి.

తెలంగాణలోని జూరాల కింద ఉన్న కాలువలు, ప్రాజెక్టులకు నీటిని వదులుతూ మరోవైపు జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని గేట్లని ఎత్తి దిగువ కృష్ణానదిలోకి నీటిని వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైల జలాశయంకు చేరుకుంటుంది. జూరాల నుంచి దాదాపు 3.24 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైల జలాశయంకు చేరుకుంటుంది.

885 అడుగులుగా శ్రీశైల జలాశయం…
ఎగువ జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైల డ్యాంకు భారీగా వరదనీరు చేరుతుండడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 885 అడుగులుగా నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 3.53,422 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వీటిలో ఏపీ పవర్ హౌస్ కి 30,520 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 14.863 మెగా యూనిట్లు, ఎడమ విద్యుత్ కేంద్రంలో 37, 882 క్యూసెక్కుల నీటిని వినియోగించి 16.768 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీటితో పాటు తెలంగాణలో కల్వకుర్తికి 2400, పోతిరెడ్డిపాడుకు 30వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -

మొత్తంగా శ్రీశైల జలాశయం నుంచి 3,93, 177 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. ఇందులో 10 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 2,80,750 ల క్యూసెక్కులు దిగువ సాగర్ కు విడుదలవుతుంది. వాస్తవంగా శ్రీశైలం జలాశయం 10గేట్లలో ఒక గేటును శుక్రవారం రాత్రి మూసివేసి 9గేట్ల ద్వారా నాగార్జున సాగర్ నీటిని విడుదల చేశారు. అయితే ఎగువ నుంచి భారీగా ప్రవాహం ఉండడంతో శనివారం ఉదయం మళ్లీ మూసివేసిన గేటును తెరిచి 10గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement