Tuesday, November 19, 2024

SRISAILAM PROJECT : భారీగా వరద నీరు.. రెండు గేట్లు ఎత్తివేత

నంద్యాల బ్యూరో, అక్టోబర్ 19, ఆంధ్రప్రభ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుకుంటుంది. శనివారం నాటికి ఇన్ ఫ్లో 1,05,059 క్యూసెక్కుల వరద నీరు పైనుంచి వచ్చి డ్యామ్ లోకి చేరుతుంది. వరద నీరు అధికంగా రావడంతో రెండు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి కిందికి 99488 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీరు విడుదల చేశారు. ఈ ఏడాది శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడం అయిదవ సారి. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరుకోవడంతో క్రిందకు నీరు వదిలారు. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటిమట్టం కెపాసిటీ 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.60 అడుగులకు చేరుకున్నది.

నీటి సామర్థ్యం కెపాసిటీ ప్రస్తుతం 212.9198 టీఎంసీలకు చేరుకోవడంతో కిందకి నీరు వదిలారు. ఎగువ ప్రాంతమైన ముచ్చుమర్రి మల్యాల 1561 క్యూసెక్కులు స్పీల్ వే ద్వారా 20,918 క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతం నుంచి వస్తుంది. కుడి, ఎడమల జల విద్యుత్తు కోసం కుడి భాగం విద్యుత్తు కోసం 15.398 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి కోసం నీటిని, ఎడమ భాగం విద్యుత్ కోసం 16.371 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విద్యుత్ కోసం వినియోగిస్తున్నారు. ఆదివారం మరొక గేటు ఎత్తి కిందకి నీరు విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో రానున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement