Tuesday, November 19, 2024

నేటినుంచి శ్రీశైలం మల్లన్న సర్వదర్శనాలు..

శ్రీశైల మల్లన్న భక్తులకు నేటి నుంచి సర్వదర్శనాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. క‌రోనా నిబంధనలు పాటించాల్సిందేన‌ని ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాల‌ని…. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నారు. కరోనా నిబంధనల దృష్ట్యా గర్భాలయ అభిషేకాలను ఏడు విడుతలుగా, సామూహిక అభిషేకాలు నాలుగు విడుతలుగా కల్పించాలని నిర్ణయించారు. అలాగే వీఐపీ బ్రేక్‌ దర్శనాలు మూడు విడుతలుగా కల్పించనున్నారు. అభిషేకంతో పాటు దేవాలయంలో జరిగే సేవల టికెట్లన్నీ ఆన్‌లైన్‌, కరెంటు బుకింగ్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని ఈవో వెల్ల‌డించారు. ఇక‌, ఆర్జిత కుంకుమార్చన, నవావరణ అర్చన, వృద్ధ మల్లికార్జునస్వామి వారి ఆర్జిత అభిషేకాలు పరిమిత సంఖ్యలో కొనసాగనున్నాయి. బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా అంటే ఉదయం 7 గంటలకు తొలి విడుత, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో విడుత, తిరిగి రాత్రి 7.30 గంటలకు మూడో విడుత బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు.

ఇది కూడా చదవండి: భారీ వర్షం ఆగిన బొగ్గు ఉత్పత్తి..

Advertisement

తాజా వార్తలు

Advertisement