Friday, November 22, 2024

ఎల్లుండి నుంచి శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ మళ్లీ ప్రారంభం

కర్నూలు, ప్రభ న్యూస్‌ బ్యూరో: ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించు కొని ఈ నెల 20 వతేదీన నుంచి భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించనుంది. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గత మార్చి నెలలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. అయితే కొవిడ్‌ కారణంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం చైత్రమాసము అంటే గత ఏప్రిల్‌ నుంచి ఆలయ అధికారులు నిలుపుదల చేశారు. ప్రస్తు తం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, 20 వ తేదీ సాయంత్రం స్వామి, అమ్మవారికి మహామంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగించి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. తరువాత స్వామి, అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నంది మండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆల యం, అక్కడ నుండి వలయరహదారి మీదుగా పంచ మఠాలు, మల్లమ్మ కన్నీరు, పుష్కరిణి వద్దకు చేరుకుంటు-ంది. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు చేరు కుంటు-ంది. నందిమండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement