Sunday, September 15, 2024

Srisailam dam | తగ్గిన వరద.. 10గేట్లు మూసివేత..

నంద్యాల బ్యూరో, సెప్టెంబర్ 4 (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లా పరిధిలోని శ్రీశైలం ప్రాజెక్టు డ్యాంకు ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు తగ్గడంతో 10 గేట్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అన్ని గేట్లను బంద్ చేసి నాగార్జునసాగర్ కు నీటిని నిలిపివేశారు. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,43,199 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది.

శ్రీశైలం డ్యాం నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.70 అడుగుల నీరు ఉంది. శ్రీశైలం డ్యాం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.284 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండు విద్యుత్ కేంద్రాల ద్వారా1,81,235 క్యూసెక్కుల నీటిని విద్యుత్ సరఫరాకు వినియోగిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి తక్కువగా రావడంతో ఈ గేట్లను మూసివేసినట్లు ఇంజనీర్ అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని కూడా తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement