Sunday, November 17, 2024

Srisailam Dam – పోటెత్తిన ప‌ర్యాట‌కులు

గేట్లు ఎత్త‌డంతో దిగువ‌కు నీటి ప్ర‌హ‌హం
వీకేంట్ కావడంతో పోటేత్తిన జ‌నం
అటు పుణ్య క్షేత్రం.. ఇటు రిజ‌ర్వాయ‌ర్ సంద‌ర్శ‌న‌కు రాక‌
ఘాట్ రోడ్డులో ప‌ది కిలో మీట‌ర్ల మేర ట్రాపిక్ జాం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – కర్నూలు బ్యూరో .. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తారు.. ఫుల్ వాటర్.. దీనికితోడు వీకెండ్.. ఇంకేముందీ.. శ్రీశైలం రద్దీ అమాంతం పెరిగింది. డ్యాం చూడటానికి వచ్చే సందర్శకుల‌తో న‌ల్ల‌మ‌ల కొండ ప్రాంతం కిట‌కిట‌లాడుతున్న‌ది.. సహజంగానే వీకెండ్ రోజుల్లో శ్రీశైలం మహా పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులు సంఖ్య ఎక్కువుగానే ఉంటుంది.. శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తడంతో డ్యామ్ చూసేందుకు పర్యటకుల తాగిడి పెరిగింది. రైయినీ సీజన్ లో నల్లమల్ల అందాలను వీక్షించడానికి టూరిస్టులు క్యూ కడుతున్నారు. నీటి ప‌ర‌వ‌ళ్ల‌ను చూసేందుకు జనం పొటెత్తుతున్నారు..

- Advertisement -

ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి

ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైల జలాశయ గేట్లను ఎత్తివేయడంతో ప్రత్యేక నీటి శోభను సంతరించు కుంది. ఈ క్రమంలో శ్రీశైలం మల్లికార్జున బ్రమరాంబికా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు నిత్యం తరలివచ్చే భక్తులు, యాత్రికులు, పర్యాటకుల తాకిడి శ్రీశైల డ్యామ్ వద్ద ఆధికమైంది. ప్రస్తుతం కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైల జలాశయం కు భారీగా వరద వస్తుండడంతో జలాశయం గేట్లను ఎత్తి డ్యామ్ నుంచి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్న సంగతి విదితమే. డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులు తుండటంతో ఆదృశ్యాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, యాత్రికులు జలాశయం వద్దకు చేరుకుంటున్నారు. రేపు ఆదివారం సెలవు రోజు కావడంతో శనివారం నుంచే తాకిడి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. సున్నిపెంట నుంచి దోమలపెంట వరకు సుమారు 10 కిమీ మేర భారీగా పర్యాటకుల వాహనాలు కనిపిస్తున్నాయి.
ఆసుందర దృశ్యాల చూడాలంటే రెండు కనులు చాలవు. డ్యాం గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తుండడంతో ఇక దృశ్యాల గురించి వర్ణించలేం. సుందరమైన వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.

శ్రీశైలం ఆనకట్ట నుంచి కృష్ణమ్మ పరవళ్లను చూస్తూ పరవశించి పోతున్నారు. తమ పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా నీటి పరవళ్ళ దృశ్యాలను తమ కెమెరాలు, సెల్ఫోన్లలో సెల్ఫీ లతో బందిస్తున్నారు. జలాశయం ఎత్తు 885 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు దిగువకు వెళ్తుంటే.. తెల్లని పాలవలే నురుగుతో ఆ దృశ్యమే అద్భతంగా ఉంటుందని కర్నూలు నగరానికి చెందిన ఉస్మానియా కళాశాల లెక్చరర్ శివ ప్రసాద్ పేర్కొన్నారు. నీళ్లలో నుంచి వచ్చే మురగ పాలకన్నా తెల్లగా కనిపించే దృశ్యాలను వీక్షిస్తూ పరవశించి పోతున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో ఎత్తైన కొండలు, పచ్చని పరవళ్లు శ్రీశైల డ్యామ్ ను మరింత కనువిందు చేస్తున్నట్లు పర్యాటకు పేర్కొంటున్నారు. నీటి పరవళ్ల మూలంగా ఉత్పన్నమయ్యే ఇంద్ర దనస్సు రంగులు శ్రీశైల డ్యాంకు మరింత అందాన్ని తెస్తున్నట్లు పర్యాటకులు పేర్కొంటున్నారు.

10 కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జాం

దీంతో ఎక్కడపడితే అక్కడ తమ వాహనాలు ఆపేస్తుండటంతో . శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ జాం అయ్యింది. 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నా . ఎప్పటికప్పుడు భారీగా వస్తున్న వాహనాలతో చాలా నిదానంగా ముందుకు కదులుతున్నాయి వాహనాలు. వ్యూ పాయింట్ నుంచి దోమల పెంట వరకు ఫుల్ ట్రాఫిక్ నెలకొంది. మెయిన్ రోడ్డు పక్కనే వాహనాలు నిలిపడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు శ్రీశైలం పోలీసులు అవస్థలు పడుతున్నారు.

నిండుతున్న జలాశయం..

శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, 882.80 అడుగులుగా ఉంది. 215 ఈఎంసీల నీటి నిల్వలకు గాను 203.4290 టిఎంసీల నీటిని నిలువ చేశారు. ఇదే సమయంలో జలాశయంకు 4.81 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా ఉంది. ఇందులో జూరాల స్పిల్ వే నుంచి 2,95,418, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 17,96 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,67,864 క్యూసెక్కుల నీరు చేరుతుంది. మొత్తంగా జలాశయం కు 4,81,246 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఇక డ్యామ్ నుంచి 4,24,,466 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. ఇందులో ఏపీ పవర్ హౌస్ నుంచి 24,618, ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 38050, శ్రీశైలం డ్యాం స్పిల్ వే గేట్లు 20 అడుగుల మేర 10 గేట్లను ఎత్తి 4,64,740 క్యూసెక్కుల నీరు దిగువ సాగర్ కు విడుదలవుతుంది. ఇదే సమయంలో పోతిరెడ్డిపాడు కి 25వేల క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి 500 క్యూసెక్కులు, కల్వకుర్తికి 1600 క్యూసెక్కులు విడుదలవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement