Friday, November 22, 2024

AP: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద…

కర్నూలు బ్యూరో : శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతుంది. దీంతో డ్యాంలో కనిష్ట స్థాయిలో నీటి నిల్వలు చేసుకుని 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి ఇరిగేషన్ అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయం డ్యాంకు వస్తున్న నీటి ప్రవాహం, విడుదలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీశైల జలాశయంకు ఇన్ ఫ్లో 4,82,401, ఔట్ ఫ్లో 4,42,977 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులు..

జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిలువలు 215 టీఎంసీలకు గానూ, 207.410 పీఎంసీల‌ నీరు నిల్వ ఉన్నాయి. ఇక జలాశయంకు జూరాల స్పిల్ వే నుంచి 303180, విద్యుత్ కేంద్రం నుంచి 18,223, సుంకేసుల బ్యారేజ్ నుంచి 1,60,998 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుంది. కుడి, ఎడమ కేంద్రాల్లో జల విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా సాగుతుంది. ఇందులో ఏపీ విద్యుత్ కేంద్రం నుంచి 23,977 క్యూసెక్కుల నీటితో 14.159 మెగావాట్ల, తెలంగాణ ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 37,080 క్యూసెక్కుల నీటిని వినియోగించి 17.732 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

వీటితో పాటు ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్ కు 253, పోతిరెడ్డిపాడుకు 25000, తెలంగాణలోని కల్వకుర్తికి 1600 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ఇక శ్రీశైలం జలాశయంకు చెందిన పది గేట్ల నుంచి 4.67 లక్షల క్యూసెక్కుల నీరు దిగువ సాగర్ కు వెళుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement