శ్రీశైలం మల్లన్న ఆలయంలో నేటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.. ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. ఇక, సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహిస్తారు.. రేపటి నుండి శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, వివిధ వాహనసేవలు ఉంటాయి..
ఈ నేపథ్యంలో నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు రుద్ర, చండీ, మృత్యుంజయ హోమాలు నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.. అంతేకాకుండా.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీస్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత, ప్రదోషకాల, ప్రాతకాల, ఉదయస్తామాన సేవలు నిలుపుదల చేసినట్టు దేవస్థానం వెల్లడించింది..
మల్లన్నకు పుష్ఫార్చన.
శ్రీశైలం మల్లన్న ఆలయంలో పుష్యశుద్ధ ఏకాదశి సందర్భంగా అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పుష్పార్చన నిర్వహించారు.. పుష్పకైంకర్యమంలో సుమారు 40 రకాల పుష్పలు, బిల్వం, దవనం, మరువం వంటి పత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లకు ఆర్చకస్వాములు విశేషంగా పూజాదికాలు జరిపించారు. ఈ పుష్పార్చనలో 4వేల కేజీల పుష్పాలు మొత్తం 40 రకాల పుష్పాలతో ఈ పుష్పార్చన జరుపగా పుష్పార్చనలో అర్చక, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించి సంకల్పంలో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతిపూజ జరిపించారు. అనంతరం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పుష్పార్చన జరిపారు. ఈ పుష్పార్చన సందర్భంగా వేదపారాయణలు జరిపేందుకు దేవస్థానం వేదపండితులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి మరో 15 మంది వేదపండితులతో పారాయణలను నిర్వహించగా పుష్పకైంకర్యానికి పుష్పాలంకృత వేదికను పుష్పాలన్నింటిని ఏపీ రాష్ట్ర బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు పుంగనూరు రామచంద్ర యాదవ్ దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఈ పుష్పార్చనలో పుష్పాల విరాళం దాత రామచంద్ర యాదవ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు..