శ్రీకాకుళం : ఎంతో కష్టపడి చదివి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి కార్తీక్ పరీక్ష రాస్తున్న సమయంలోనే ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన ఇన్విజిలేటర్లు అప్రమత్తమై వైద్య సిబ్బందితో పరీక్షలు నిర్వహించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో పాతపట్నంలో విషాధ ఛయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు బోరున విలపించారు. తమ కుమారుడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఇప్పుడు ఇలా జరిగిందేంది దేవుడా అంటూ తల్లిదండ్రుల రోదనలు అక్కడ ఉన్నవారితో కూడా కంటతడి పెట్టించాయి. కొడుకు ప్రయోజకుడై కష్టకాలంలో ఆదుకుంటాడనుకున్న తల్లిదండ్రులకు తీరనిశోకం మిగిలిందని గ్రామస్తులు అంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement