Sunday, November 24, 2024

ప్రాణాలొదిలిన మాన‌వ‌త్వం…

డబ్బు కోసం పట్టు.. చికిత్స నిర్లక్ష్యం
నగదు సమకూర్చేలోగా ప్రాణాలొదిలిన రోగులు
ఆస్పత్రులల్లో సిబ్బంది, వాహన యజమానుల వైఖరిపై విమర్శలు
శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురి జీవితాలు విషాదాంతం

శ్రీకాకుళం : కరోనా మహ మ్మారి మానవత్వాన్ని మంటగలిపేస్తోంది. కరోనా రోగులను అంటరానివారిగా చూస్తుండడం, కరో నాతో చనిపోయినవారిపట్ల కొన్నిచోట్ల కుటుంబ సభ్యులు, మరికొన్ని చోట్ల ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు బాధిస్తోంది. రెండు రోజులుగా శ్రీకాకుళంలో జరిగిన మూడు సంఘ టనలు జిల్లాలో మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న రెండు ప్రయివేటు ఆసుపత్రుల వర్గాల తీరును బట్టబయలు చేసింది. కాగా మంగళవారం పలాస పట్ట ణంలో ఒక మహిళ అనారోగ్యంతో పలాస అసుపత్రికి వచ్చింది. ఆమె కుమారుడు దాదాపు 20 కి.మీల దూరం లోగల తన గ్రామం నుండి ఆసుపత్రికి ఆటోలో తీసుకు వచ్చారు. అయతే, ఆమెకు సీటీస్కాన్‌ చేయించేందుకు గాను ఆమెను పలాస వేరే ల్యాబ్‌ వద్దకు తీసుకువెళ్లమని ఆసుపత్రివర్గాలు తెలపడంతో ఆ మేరకు ఆమెను అదే ఆటోలో సీటీస్కాన్‌ తీయించేందుకు కుమారుడు తీసు కువెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మరణించింది. దీంతో ఆటోడ్రైవర్‌ మృతదేహాన్ని అక్కడే దించేయాలని చెప్ప డంతో నడిరోడ్డుపై ఆమె మృతదేహాన్ని దించాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లేందుకు గాను అంబులెన్స్‌కు ఫోన్‌లు చేసినప్పటికీ రెండుమూడు గంటల వరకూ ఎవరూ స్పందించకపోవడంతో చేసేది లేక మృతురాలి కుమారుడు తన స్నేహితుల సహాయంతో ద్విచక్ర వాహనంపైనే తల్లి శవాన్ని కూర్చోబెట్టి గ్రామానికి తీసు కువెళ్లాడు. కాగా బుధవారం నాడు జిల్లాలోని రాజాం పట్టణంలో కరోనా చికిత్సకోసం మండ లం పెంటఅగ్రహారం అంజ లి అనే మహిళ కరోనా బారిన పడింది. ఆమెను రాజాం లోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి కుమా రుడు, కుటుంబ సభ్యులు తరలించారు. అయితే ఆ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు ముందుగా డబ్బులన్నీ చెల్లించాలని ఆసుపత్రివర్గాలు తెగేసి చెప్పాయి. అయితే ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తామని కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యానికి చెప్పినప్పటికీ వారు పట్టిం చుకోకుండా నేరుగా నగదు ఇస్తేనే చికిత్స చేస్తామని చెప్ప డంతో గత్యంతరం లేక ఆ మహిళను బయటకు తీసుకు వచ్చి కుటుంబ సభ్యులు ఏటీఎంల కోసం పరుగులు తీసారు. కాగా ఎటిఎంల నుండి నగదు తీసేందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టడంతో రోడ్డుపై నిల బడిన కరోనా బాధితురాలు అక్కడే కన్నుమూసింది. ఆమెను అక్కడి నుంది తరిలించేందుకు స్థానిక నగరపా లక సంస్థగాని, ఇతరులు ఎవరూ ముందుకు రాకపోవ డంతో మృతురాలి కుటుంబ సభ్యులు నానా అవస్థలు ప డ్డారు. ఈ పరిస్థితులు చూసిన స్థానిక పాత్రికేయుడు రాజేష్‌ ఆమె మృతదేహాన్ని ప్రత్యేకంగా ఒక వాహనం ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేసి దగ్గరుండి మరీ మృతదేహాన్ని వాహనంలోకి ఎక్కించేందుకు సహాయపడ్డా డు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం పట్ట ణంలోని మరొక కార్పొరేట్‌ ఆసుపత్రిలో సిబ్బంది తీరు కారణంగా ఒక వృద్ధుడు ప్రాణం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక పాలీటెక్నికల్‌ కళాశాల వద్దగల యాతపేటకు చెందిన రాములు అనే వృద్ధుడిని కుటుంబ సభ్యులు ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అతని చికిత్స చేసేందుకు ఆసుపత్రిలో బెడ్‌లు లేవని సిబ్బంది నిర్దయగా చెప్పడంతో అతను ఆసుపత్రి షెల్లార్‌ దగ్గర కుర్చీలో కుప్పకూలిపోయాడు. ఊపిరితిత్తుల ఇబ్బందితో బాధపడుతున్న అతని పరిస్థితిని చూసి స్థానికులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే సమయంలో ఆసుపత్రి సిబ్బంది అతను కూర్చున్న చోటకే ఆక్సిజన్‌ సిలెండర్‌ తెచ్చి తగిలించారు. అయితే అతను మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడంతో తీవ్రమైన యండలో ఆసుపత్రి బయటకు వచ్చి మూత్రవిసర్జన చేస్తూ కుప్పకూలిపోయాడు. కాగా ఇది చూసిన వారు ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి చెప్పడంతో సిబ్బంది అతనిని స్ట్రచ్చర్‌పై ఆసుపత్రికలోకి తీసుకువెళ్లగా అప్పటికే వృద్ధుడు చనిపోయినట్లు స్పష్టమయ్యింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement