Sunday, September 8, 2024

SKLM: సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకం.. ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి

(ప్రభ న్యూస్ బ్యూరో), శ్రీకాకుళం, జూన్ 3: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమని, సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని లెక్కింపు ప్రక్రియ సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి ఆదేశించారు. సోమవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికలు-2024 నేపథ్యంలో జూన్ 4వ తేదీన నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై రెండవ విడత సూక్ష్మ పరిశీలకుల శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరిశీలకులు శేఖర్ విద్యార్థి, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని సమూన్, ఎన్నికల తలత్ పర్వేజ్ ఇక్బాల్, రోహీల్, మాలతుస్, ఎస్ సంగమ్, అనుజ కుమార్ దాస్, అశోక్ కుమార్, ఎస్ సంగీత, అజిజ్ శుక్లదాస్ లు పాల్గొన్నారు.

ఈసందర్భంగా పరిశీలకులు శేఖర్ విద్యార్థి మాట్లాడుతూ… అబ్జర్వర్ల సమక్షంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గత ఆరు నెలలుగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు రిటర్నింగ్ అధికారులు నుంచి వివిధ స్థాయిలో అధికారులు, సిబ్బంది తదితరులు పని చెయ్యడం జరిగిందన్నారు. అయితే మరో కీలకమైన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న పరిశీలకులు మాట్లాడుతూ… విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలనుసరించి, సకాలంలో విధులకు హాజరుకావాలని, ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన విధులు నిర్వహించాలని, విధులు కేటాయించిన ప్రొసీడింగ్స్ తో పాటు, గుర్తింపు కార్డు కూడా తీసుకురావాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో అందరూ సక్సెస్ కావాలన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో మాస్టర్ ట్రైనర్ శేషగిరి, ఎల్డిఎం సూర్య కిరణ్, సాంఘీక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వ మోహన్ రెడ్డి, సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement