కశింకోట,మార్చి5(ప్రభ న్యూస్): ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు మంగళవారం పరిశీలించారు. తొలుత హెలిప్యాడ్ ప్రాంతాన్ని, పిసినికాడ సభ స్థలాన్ని పరిశీలించి సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలక్టర్ రవి పటాన్ శెట్టి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు.
సీఎం జగన్ ఈ నెల 7న పీసినికాడ హైవే ప్రక్కన 4వ విడత చేయూత నిధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నోక్కి విడుదల చేయబోయే సభా ప్రాంతాన్ని జిల్లా కలక్టర్ రవి పటాన్ శెట్టి,విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్నీ, ముఖ్యమంత్రి ఇంటిలిజెన్సీ సిబ్బంది పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని కలక్టర్ కోరారు. అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వర్తించి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలన్నారు. శాఖల వారీగా కేటాయించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రొటోకాల్ ప్రకారం బందోబస్తు:
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ప్రకారం బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ తెలిపారు. హెలిప్యాడ్, సభా స్థలం ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రోడ్లు, భవనాలశాఖ అధికారులకు సూచించారు. బందోబస్తు ఏర్పాట్లలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా పక్కాగా చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.స్పెషలిస్ట్ డాక్టర్లను, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు.