Tuesday, November 19, 2024

ఇళ్లలోనే శ్రీరామ నవమి వేడుకలు – కలెక్టర్ నివాస్

శ్రీకాకుళం, : జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలు ఎక్కడ నిర్వహించవద్దని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని దీని దృష్ట్యా ప్రజలు వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీరామ నవమిని కుటుంబ సభ్యులు ఇంట్లోనే నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఇంట్లో కూడా కోవిడ్ నియంత్రణ చర్యలు చేపడితే మంచిదని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేస్తూ కరోనా కేసులు పెరుగుతున్న తీరును ప్రజలు గుర్తించాలని తదనుగుణంగా కరోనా సోకకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కును విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని ఆయన తెలిపారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి వారు స్వయం నియంత్రణ చర్యలు పాటించాలని కలెక్టర్ సూచించారు. శ్రీరామ నవమిని కూడా కరోనా సమయంలో వేడుకగా నిర్వహించకుండా, ఇంటి వద్దనే పూజలు నిర్వహించి కుటుంబం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement