శ్రీకాకుళం కు గొండు శంకర్..
పాతపట్నం కు గోవిందరావు..
పలాసకు శిరీష..
శ్రీకాకుళం, మార్చి 22: తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదలైంది. ఇందులో సీనియర్ శాసనసభ్యులు అయిన కలపట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవికి పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. అయితే పలాసకు మాత్రం గౌతు శిరీషను అభ్యర్థిగా చేసింది.
శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు గొన్డు శంకర అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత ఖరారు చేశారు. యువ నాయకులు మామిడి గోవిందరావుకె పాత పట్నం స్థానానికి అధినేత అవకాశం ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఇంతవరకు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ ఎస్ టీ నియోజకవర్గం జనసేనకు, ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినట్లుగా తెలుస్తోంది.
- Advertisement -