శ్రీకాకుళం, ప్రభ న్యూస్: శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, ఉషోదయ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరచి తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలలో రన్నర్స్‌గా నిలిచారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తమరాల జయరామ్ మీడియాకు తెలిపారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఎఫ్.జెడ్ స్పోర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో జేఎన్ గ్రూపునకు చెందిన ఎస్.ఎల్.వి ఇండోర్ స్టేడియం నిజాంపేటలో రెండు రోజుల పాటు తెలంగాణ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహించారు. టోర్నీలోని మెన్స్ డబుల్స్ పోటీల్లో కవిటి ఉషోదయ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు చెందిన జి.సోమేష్, ఆర్‌ఆర్‌సి అకాడమీకి చెందిన టి.విగ్నేష్ పోటీలలో పాల్గొన్నారు.
కవిటికి చెందిన సోమేశ్ జంట సెమీఫైనల్లో గుత్తాజ్వాల అకాడమీకి చెందిన పంజాబ్ క్రీడాకారులుపై విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించారు. ఫైనల్లో హర్యానా రాష్ట్రాన్రికి చెందిన గుత్తాజ్వాల అకాడమీకి చెందిన కార్తీక్ జిండల్ (వరల్డ్ ర్యాంక్ 198), అనంతశివం జిండల్ (వరల్డ్ ర్యాంక్ 398)పై 21-15 ,21-18 స్కోరుతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తమరాల జయరామ్, చీఫ్ పాట్రన్ ఎల్ రాజేష్, వైస్ ప్రెసిడెంట్ బి.రమేష్, సెక్రెటరీ చంద్రశేఖర్, ఆర్.ఈ.సి.హెచ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ టి.శరత్, ఎం.ప్రసాద్, వెంకటరావు క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital