Tuesday, November 19, 2024

SKLM: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి.. జాయింట్ క‌లెక్ట‌ర్

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి
జాయింట్ క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఫర్మాన్ అహ్మద్ ఖాన్
శ్రీకాకుళం, జులై 26: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుకు కృషి చేస్తానని జాయింట్ క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వారి సూచనలతో జిల్లా అభివృద్థిలో ముందుండేలా నిరంతరం కృషి చేస్తానని, ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రతి వారం డివిజన్, మండలం స్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జాయింట్ క‌లెక్ట‌ర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు.

జిల్లాలో స‌మ‌స్య‌లు తెలుసుకుని వాటి ప‌రిష్కారం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తాన‌ని చెప్పారు. నూత‌న జాయింట్ క‌లెక్ట‌ర్ గా ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం క‌లెక్టరేట్ లోని త‌న ఛాంబ‌ర్ లో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌జల సంక్షేమానికి కృషి చేస్తాన‌ని తెలిపారు.

జాయింట్ క‌లెక్ట‌ర్ కు అధికారులు, ప్ర‌ముఖుల‌ శుభాకాంక్ష‌లు..
జిల్లా నూత‌న జాయింట్ క‌లెక్ట‌ర్ గా శుక్రవారం బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు జిల్లా అధికారులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు తన ఛాంబ‌ర్ లో క‌లిసి పుష్ప‌గుచ్ఛాలు అంద‌జేసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సీ హెచ్ రంగయ్య, పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి భరత్ నాయక్, ఎల్డిఎం సూర్య కిరణ్, పి.డి, డిఆర్డిఎ కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డీఎస్ఓ శాంతిశ్రీ, జిల్లా ఉద్యాన అధికారి ఆర్ వి ప్రసాద రావు, డి.డి ఫిషరీస్ శ్రీనివాస్, డిఐపిఆర్ఓ కె చెన్నకేశవ రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి కె. బాలమాన్ సింగ్, డివిజనల్ పిఆర్ఓఎన్ రాజు, రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు, క‌లెక్ట‌రేట్ ఏవో, ఇత‌ర విభాగాల సూప‌రింటెండెంట్లు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, వైద్యాధికారులు, త‌హ‌శీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు శాఖ‌కు చెందిన అధికారులు, సిబ్బంది జాయింట్ క‌లెక్ట‌ర్ ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement