Friday, November 22, 2024

జాతికి సన్మార్గం నిర్దేశించిన మహర్షి వాల్మీకి : మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం : రామాయణాన్ని మహా కావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి, మహర్షి వాల్మీకి అని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. పుణ్య భూమి, కర్మ భూమి మన భారత దేశమని రామాయణం మన పూజ్య గ్రంథమని అలాంటి గ్రంథాన్ని రచించిన మహర్షి వాల్మీకి పూజ్యనీయులన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాయింట్ కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఆది కవి వాల్మీకిని స్మరించుకుని, దివ్య పురుషునికి నీరాజనాలు పలికారు. ఒకే మాట… ఒకే బాణం.. ఒకే పత్ని.. అనే రాముడి లక్షణాలు చాలా సులువుగా ప్రజలకు అర్థమయ్యేలా తన రచనలతో చేరవేసిన అతడు గొప్ప శక్తి అని, అందుకే ఒక బోయవాడు కాస్త మహర్షిగా కీర్తించబడ్డారన్నారు. జేసీ సంయుక్త కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ… రామా అని పలకడం కూడా రాని వ్యక్తి సత్యం, ధర్మనిష్ఠ నేర్పి మహర్షి అయ్యాడు అన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనురాధ, డీఆర్డీఏ పథక సంచాలకులు బీడీ విద్యాసాగర్, సెట్ శ్రీ సీఈవో బీ.ప్రసాద రావు, ఎన్ వై కే కోఆర్డినేటర్ వెంకట్ ఉజ్వల్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్.నారాయణరావు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ ఎం.మాధురి, కలెక్టర్ కార్యాలయ ఏవో రాజేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామారావు, బీసీ సంఘాల నాయకులు చంద్రపతి రావు, పసగడ రామకృష్ణ హాజయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement