Friday, November 22, 2024

AP : అల్లర్లు,హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలుః ఎస్పీ రాధిక

శ్రీకాకుళం, ప్ర‌భ‌న్యూస్ః అల్లర్లు,హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని ఎస్పీ రాధిక తెలిపారు. శ‌నివారం శ్రీకాకుళం పట్టణంలో జిల్లా ఎస్పీ రాధిక పర్యవేక్షణలో జిల్లా ఆర్ముడ్ రిజర్వు పోలీసులు డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు.

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల అనంతరం తుది ఫలితాలు వచ్చేవరకు జిల్లాలో ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ – మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు . ఈ మాబ్ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం పోలీసుల సన్నద్ధత, ప్రజల్లో అవగాహన,చైతన్యం చేసేందుకు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విభూతం కలిగించే అసాంఘిక శక్తుల మూకలను నియంత్రించి, ఒకే చోట నలుగురు కన్న ఎక్కువ మంది గుమ్ము గుడి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై లాఠీచార్జ్, ఫైరింగ్ చేయడానికి వెనకాడబోమని ఎస్పీ హెచ్చరించారు. ఓట్లు కౌంటింగ్ తుది ఫలితాలు అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహణకు అనుమతులు లేవని, జిల్లాలో శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు జిల్లా పోలీసులు యంత్రంగానికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.

ఆక‌ట్టుకున్న మాక్‌డ్రిల్‌….
ముందుగా ఓ వైపు ప్లకార్డులు చేతపట్టిన ఆందోళనకారులు, అల్లరి మూకలు(పోలీసులు) మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు ఆందోళనకారులను (వేషాల్లో ఉన్న పోలీసులు) మొదటగా హెచ్చరిక ఇచ్చుట, అది వినకపోతే పై అధికారుల అనుమతితో భాష్ప వాయువు ప్రయోగించుట ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించుట,లాఠీ చార్జ్ చేపట్టుట,ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ చేయుట. అప్పటికి పరిస్థితి అదుపులోకి రాక పోతే ఆందోళనకారులు చెదరగొట్టేందుకు ఫైరింగ్ చేయుట వంటివి మాబ్ అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement