Sunday, November 24, 2024

మ‌త్స్యకారుల‌కు చిక్కిన అరుదైన సొర‌ చేప‌…. బ‌రువు వెయ్యి కిలోలు

మ‌త్స్య‌కారుల‌కు ఓ అరుదైన చేప దొరికింది. అది మామూలు చేప కాదు..చాలా బ‌రువైన చేప‌. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని మరువాడ పంచాయతీ డి.మరువాడ సముద్రతీరంలో మత్యకారుల వలకు సొరచేప చిక్కింది. మత్స్యకారులు వల లాగుతున్నప్పుడు బరువుగా ఉండటంతో భారీ స్థాయిలో చేపలు పడి ఉంటాయని అంతా సంబరపడ్డారు. తీరా వలను ఒడ్డుకు చేర్చాక లోపల ఉన్న సొర చేపను చూసి అంతా తలలు పట్టుకున్నారు. మెరుగు నూకయ్య అనే మత్స్యకారుడి వలకు చిక్కింది ఈ భారీ చేప.. దీనిని పులిమొఖం సొరచేపగా పిలుస్తారని, సుమారు వెయ్యి కిలోల ఈ సొర చేప వలకు చిక్కడంతో సుమారు 20 వేల రూపాయల వల చిరిగిపోయింది. వలలోని చేపలను కూడా సొర తినేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని మత్స్యకారుడు మేరుగు నూకయ్య వాపోయాడు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒడ్డుకు చేర్చిన సొరచేపను మత్స్యకారులు చంపకుండా తిరిగి సముద్రంలోకి అతి కష్టంమీద చేర్చారు. అయితే ఆ చేప వెయ్యి కిలోల బ‌రువు, 15 అడుగుల పొడ‌వు ఉంటుంద‌ని మ‌త్స్య‌కారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement