Monday, November 25, 2024

SKLM: ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా ముందస్తు చర్యలు..కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

శ్రీకాకుళం, డిసెంబరు 4 : మిచౌంగ్ తుపానుతో జిల్లాలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. తుపాను హెచ్చరికతో జిల్లాలో తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి హాజరైన అనంతరం ఆయన ఫ్రంట్ లైన్ అధికారులతో మాట్లాడారు. తుఫాను బాపట్ల జిల్లాపై ప్రభావం చూపే అవకాశముందని, శ్రీకాకుళం జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశముందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సత్వరమే చర్యలు చేపట్టేలా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. వరికోతలు చేయరాదని ముందుగానే హెచ్చరించామని, భారీ వర్షాలు కురిస్తే ఆహార పంటలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ జి.అర్.రాధిక, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఇంఛార్జి డీఆర్వో జయదేవి, జిల్లా వ్యవసాయ అధికారి కే.శ్రీధర్, బి.అర్.అర్ వంశధార ప్రాజెక్టు ఎస్ఈ డోల తిరుమలరావు, జిల్లా ఉద్యాన అధికారి ప్రసాద్, డీఎస్వో వెంకట రమణ, మత్స్య శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, సర్వ శిక్షా అభియాన్ ఏపీసీ జయ ప్రకాష్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శిమ్మ నేతాజీ, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జిల్లా అగ్నిమాపక శాఖాధికారి జే.మోహన రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement