ఇచ్ఛాపురంః ఛలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. వారు రైల్వే స్టేషన్ కు చేరకుండానే మార్గమధ్యంలోనే వారిని అడ్డగించారు. ఆ సమయంలో కొంత పెనుగులాట చోటుచేసుకుంది.
అనంతరం వారందరినీ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని ముందస్తు అరెస్ట్ చేసినట్లు ఎస్సై గోవిందరావు తెలిపారు. అదే సమయంలో కవిటి మండలం రాపకపుట్టుగ కు చెందిన నర్తు భవాని సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు జరిపిస్తున్నారు.