Friday, October 18, 2024

SKLM: హాస్టల్స్ కు బయటి ఆహారాన్ని అనుమతించకూడదు.. క‌లెక్ట‌ర్ ఆదేశం

శ్రీకాకుళం, ఆగస్టు 20: జిల్లాలో నడుపుతున్న హాస్టల్స్ కు బయటి నుండి ఆహారం అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ వసతి గృహాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న బాలల రక్షిత గృహాలు, హాస్టల్స్ నడుపుతున్న యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ లలో చదువుకుంటున్న విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించాలని ఆదేశించారు. విద్యాశాఖ విద్యార్థులకు అక్షయపాత్ర నుండి ఆహారం వస్తుందని డీఈఓ కృష్ణ చైతన్య వివరించారు. స్టోరేజ్ చేసిన తాగునీరు వినియోగించకూడదని చెప్పారు. ఆర్.ఒ.ప్లాంట్ ఉండేటట్టు చూడాలన్నారు. ఫ్రూట్, కూరగాయలు ప్రెస్ గా ఉండాలన్నారు. 500 దాటిన వారికి ప్రత్యేక అధికారి ఉండాలని చెప్పారు. 500 లోపల ఉన్న హాస్టళ్లకు కింద స్థాయి అధికారి ప్రత్యేక అధికారి ఉండాలన్నారు. సెక్యూరిటీ ఉండాలని చెప్పారు.

డోనర్స్ ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నది లేనిది ఆయన ఆరా తీశారు. బయటి నుంచి ఆహారం తీసుకోకూడదని చెప్పారు. కాలేజీ అటాచ్డ్ హాస్టల్ ఉంటేనే నడపాలని వెనకబడిన సంక్షేమ అధికారి అనూరాధకు కలెక్టర్ ఆదేశించారు. మండల, జిల్లా కేంద్రాల్లో ఉన్న హాస్టళ్లను గుర్తించాలన్నారు. పీహెచ్ సీ వైద్యులకు ట్యాగ్ చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలని చెప్పారు. ఆహారం కలుషితం కాకుండా చూడాలన్నారు. కిచెన్ వద్ద పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ… వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయాలని, బయటి నుంచి ఆహారం తీసుకోకూడదని చెప్పారు. మసాలాలకు రంగు వేస్తున్న నేపథ్యంలో బయటి ఆహారం తీసుకోకూడదని తెలిపారు. బయటి ఫుడ్ పొల్యూషన్ అవుతుందని వివరించారు. ఎక్స్పైరీ డేట్ అయిపోతే పారవేయాలని ఆహార భద్రతా అధికారి జి.శ్రీరాములు చెప్పారు. సహాయ భద్రత నియంత్రణాధికారి వెంకటరత్నం 9704009989 నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

అనంతరం హాస్టల్స్ నడుపుతున్న యాజమాన్యాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శాంతిశ్రీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… హాస్టళ్లలో మెనూ బయట డిస్ప్లే చేయాలన్నారు. బయటి నుండి ఫుడ్ తీసుకోకూడదని చెప్పారు. పాత హిస్టరీని పరిశీలించి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. సందర్శకుల రిజిష్టర్ ఉండాలని తెలిపారు. బీసీ సంక్షేమ అధికారి అనూరాధ, సాంఘీక సంక్షేమ శాఖ డీడీ, డీఎంహెచ్ఓ, రెసిడెన్షియల్ స్కూల్ కో ఆర్డినేటర్, తదితరులు పలు సూచనలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, సాంఘీక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, జిల్లా రెసిడెన్షియల్ స్కూల్స్ కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్, ఆర్ఐఓ దుర్గారావు, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ శ్రీలక్ష్మీ, ప్రొటెక్షన్ జిల్లా అధికారి రమణ, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ శ్రీలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement