విశాఖపట్నం – యువగళం పేరుతో నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర తొలి రోజునే తారకరత్న అస్వస్థతకు గురయ్యారని, లోకేష్ ది ఐరెన్ లెగ్ అని మరోసారి రుజవైందని ఎపి టూరిజం శాఖ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, నారా లోకేష్ ని రెండో పులకేశి గా అభివర్ణించారు. నారా లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రోజా కీలక కామెంట్స్ చేశారు. తారకరత్న అస్వస్థతకు గురైతే చంద్రబాబు, లోకేష్ పట్టించుకోలేదన్నారు.
“లోకేష్ అడుగుపెట్టాడు.. రాజమండ్రి పుష్కరాల్లో జనం చనిపోయారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ రిలీజ్ చేస్తే మరకొందరు చనిపోయారు. లోకేష్ పాదయాత్ర చేపట్టాడు తారకరత్న అస్వస్థతకు గురయ్యాడు. లోకేష్ తొలిరోజే తడబడ్డాడు.. అతను లోకేష్ కాదు.. పులకేశి ” అన్నారు. తండ్రి చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి తీసుకుని లోకేష్ ఏం చేశారంటూ ప్రశ్నించారు.. తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని రోజా పేర్కొన్నారు. మీడియా సమావేశం అనంతరం విశాఖపట్నం లోని సాగర మాల కన్వీన్సషన్ లో జరిగిన అనకాపల్లి ఎంపీ సత్యవతి కుమారుడు యశ్వంత్, లీలా సరస్వతిల వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు రోజా..