Tuesday, November 19, 2024

AP : ఎన్నికల నిర్వహణలో బాధ్యతగా పనిచేయాలి.. క‌లెక్ట‌ర్ సమూన్

శ్రీకాకుళం, మే 8(ప్ర‌భ‌న్యూస్‌): ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి, ఎన్నికల కమీషన్ సూచనలను శత శాతం తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలానీ సమూన్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సెక్టోరియల్ అధికారులకు ఈవిఎమ్స్ హేండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలానీ సమూన్ పాల్గొన్నారు.

- Advertisement -

శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సెక్టోరియల్ అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలనుసారం 72 గంటలు ప్రోటో్కాల్ చాలా కీలకమన్నారు. మీ మీ కేంద్రాలకు వెళ్లి ఎటువంటి సమస్యలు ఉన్న సత్వర పరిష్కారానికి చర్యలు, సమయపాలన పాటించాలన్నారు. ఎన్నికల విధులు అందరూ సమన్వయంతో నిర్వహించారు. రిసెప్షన్ సెంటర్ శివాని కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 17 అంశాలతో కూడిన ఫార్మేట్ ఉంటుందన్నారు. పోలింగ్ మెటీరియల్ పూర్తిస్థాయిలో తీసుకున్నది చెక్ లిస్ట్ ద్వారా పరిశీలించు కోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు జరుగుతుందన్నారు.

జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ మాట్లాడుతూ, సెక్టోరియల్ అధికారులు పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రిపోర్టులను ఎన్నికల కంట్రోల్ రూమ్ కు నియమావళి ప్రకారము అందజేయాలన్నారు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో సమస్యలు ఉంటే తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. స్క్రూట్ ని ఫార్మేషన్స్ సకాలంలో నిర్వహించాలి. ప్రతి పోలింగ్ స్టేషన్ సందర్శించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పూర్తి మెటీరియల్ అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి విషయంలో క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలలో సమస్య ఉత్పన్నమైతే సెక్టోరియల్ అధికారులు తమ వద్దనున్న రిజర్వ్ పరికరములతో వాటిని భర్తీ చేయాలని తెలియజేశారు. ఈ శిక్షణా తరగతుల్లో ఈవిఎం నిర్వహణకి సంబంధిచి ప్రాక్టీకల్ గా శిక్షణా అందించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ వెంకటేశ్వర రావు, శిక్షణ తరగతుల నోడల్ అధికారి బాలాజీ నాయుక్, మాస్టర్ ట్రైనర్ శేషగిరి, కిరణ్, ఎన్ఐసి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement