Friday, September 6, 2024

SKLM: క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి.. ఎస్పీ మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం, జులై 25 : సిబ్బంది ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, వ్యక్తిగత, ఉద్యోగరీత్యా సమస్యలను పరిష్కరించి సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీక‌రించిన‌ తొలిసారిగా శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ కు జిల్లా ఎస్పీ హాజరయ్యారు. ముందుగా ఆర్మడ్ సిబ్బంది జిల్లా ఎస్పీ కి గౌరవ వందనం సమర్పించి అనంతరం పరేడ్ నిర్వహించారు.

ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ సిబ్బంది నిర్వహించిన పరేడ్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… సిబ్బంది ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని, అలాంటప్పుడే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని తెలిపారు. సిబ్బందికి ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, సాధ్యాసాధ్యాలను బట్టి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. అనంతరం పలువురు సిబ్బంది వారి వ్యక్తిగత, ఉద్యోగరీత్యా సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. ఈ పరేడ్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డీఎస్పీలు ఎల్.శేషాద్రి, జి.శ్రీనివాసరావు సిఐ అవతారం, ఏ.ఆర్, సివిల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement