నరసన్నపేట : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కచ్చితంగా ఉండాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ఆయన గురువారం ఉదయం నరసన్నపేట మండలం జమ్ము వద్దగల జగనన్న కాలనీ లేఔట్ ను పరిశీలించారు. నిర్మాణాలు జరుగుతున్న తీరుని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నీటి సదుపాయం ఉంటే నిర్మాణాలు ఇంకా త్వరితగతిన జరుగుతాయని, అందుకోసం గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రూపొందించి నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా లేకుండా వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సౌకర్యాన్ని కూడా వెంటనే ఏర్పాటు చేయాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ఎక్కడా నిధులు కొరత అనే సమస్య లేదని స్పష్టం చేశారు. ఇది సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమని, ఏమాత్రం కూడా అధికారులు అలసత్వంతో వ్యవహరించకూడదని కృష్ణదాస్ సూచించారు. ఆయన వెంట ఎంపీపీ ఆరంగి మురళీధర్, నరసన్నపేట సర్పంచ్ బి శంకర్, సుడా కార్పొరేషన్ ప్రతినిధి కోరాడ చంద్రభూషణ్ గుప్తా, పొందర, కూరాకుల కార్పొరేషన్ చైర్ పర్సన్ ప్రతినిధి రాజాపు అప్పన్న, దాలి నాయుడు, ఈవోపీఆర్డీ రవికుమార్, తదితరులున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital