Sunday, November 24, 2024

AP: చట్టాలపై అవగాహన కలిగి ఉండడం మంచిది….సబ్ ఇన్ స్పెక్టర్ హైమావతి..

సోంపేట, ఫిబ్రవరి 13(ప్రభ న్యూస్) ఇంటర్మీడియట్ దశ జీవితంలో చాలా కీలకమైందని ఈ దశలో ఏ విద్యార్థి అయితే కళాశాలలో క్రమశిక్షణ పట్టుదల ఏకగ్రీవంగా పాటుగా సమయస్ఫూర్తితో, సోదర భావంతో మెలిగి చదువుకుంటారో కచ్చితంగా తాను అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుని అందమైన జీవితాన్ని గడుపుతారని సోంపేట సబ్ ఇన్ స్పెక్టర్ బి. హైమావతి విద్యార్థులకు సూచించారు.

ఈ మేరకు మంగళవారం సోంపేట పట్టణంలో మంగళవీధిలో గల శివగాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులతో ఆమె ప్రత్యేక సమావేశమై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని దిశ చట్టం తో పాటుగా కొన్ని చట్టాల కోసం వివరించారు. ఈ చట్టాలే జీవితంలో చుట్టాలుగా ఉపయోగపడతాయని,అందమైన జీవితాన్ని కోరుకునేవారు చెడు ప్రవర్తన కలిగిన వారితో దూరంగా ఉండి కళాశాల ఆవరణములో సహ విద్యార్థులతో సోదర భావం కలిగి ఉండి కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణ,పట్టుదల, ఏకాగ్రతతో విద్యను నేర్చుకోవాలని సూచించారు. కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడితే సంబంధిత విద్యార్థికి చట్టపరంగా కలిగే నష్టాలను వివరించారు. మార్చి మొదటి వారంలో జరగబోయే పబ్లిక్ పరీక్షలను బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధి కళాశాల డైరెక్టర్ బాబు, మాస్టర్ ప్రిన్సిపల్ నరేష్ కుమార్ తో పాటుగా అధ్యాపక సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement