శ్రీకాకుళం, సెప్టెంబర్ 6(ప్రభ న్యూస్) : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన పర్యటనలో భాగంగా ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమ అమలును శ్రీకాకుళం కెళ్ళ వీధిలో ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. కెళ్ల వీధిలో నివాసం ఉన్న వారికి ప్రతిరోజూ మునిసిపల్ సిబ్బంది విధులకు హాజరు అవుతున్నారా అని ఆరా తీయగా.. వస్తున్నారని తెలుపగా, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, అక్కడ ప్రజలకు డ్రైడే ఫ్రైడే పాటించాలని తెలియజేశారు. కీటక జనిత వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండాలని, దోమల లార్వా పెరగకుండా, నీటి కుంటలు లేకుండా చూసుకోవాలని, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాదుల నుండి జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్, బి.గణేష్ కుమార్, సచివాలయ, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.