Friday, November 22, 2024

SKLM: ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.. కలెక్టర్

శ్రీకాకుళం, డిసెంబర్ 15 : జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను అదేశించారు. ఇవాళ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ.. జిల్లాలో డిసెంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. నేటి సత్ సంకల్పం రేపటి వెలుగుకు సహకారం అవుతుందన్నారు. విద్యుత్ పొదుపుతో ఇంధనం ఆదా అవుతుందని అందుకు గాను ఇంధన పరిరక్షణ కోసం ఎల్ఈడీ బల్బుల వాడకం గురించి, కరెంట్ ఇస్త్రీ పెట్టెల వాడకం, ఎక్కువ స్టార్ లు వున గృహోపక పరికరాలు వాడకం తదితర వాటి గురించి ప్రజలకు తెలియచేసి విద్యుత్ ను పొదుపుగా వాడే విధంగా ప్రజలకు ఈ వారోత్సవాల్లో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భావితరాలకు విద్యుత్ కొరత లేకుండా చూకోవాల్సిన భాద్యత మనందరిపైన ఉందన్నారు. జిల్లాలో సూర్య భగవానుడు కొలువున్నాడని, ఆ శక్తిని మనం ఇంధనంగా వినియోగించుకోవడానికి మన జిల్లా ముందుండాలన్నారు. జిల్లా కలెక్టర్ జండా ఊపి ర్యాలీ ప్రారబించారు. విద్యుత్ పొదుపు చేద్దాం.. ధనం ఆదా చేద్దాం, సేవ్ పవర్సేవ్ నేషన్, విద్యుత్ విలువైనది వృధా కాకుండా కాపాడుదాం అనే నినాదాలతో ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో ఇంధన పొదుపు ప్రచార పోస్టర్ విడుదల చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఈఈలు సత్తారు బైరి నాయుడు, ఈఈ టెక్నికల్ ఎల్ సి హెచ్ పాత్రుడు, ఎస్ ఎ ఓ పి తాతాచార్యులు, దడి ఈ సుదర్శన రావు, ఏడీ పైడి యోగేశ్వరరావు, ఏఈ లు కమల్ హాసన్, సురేష్, వివిధ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement