Thursday, September 12, 2024

SKLM: మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా కృషి… కలెక్టర్

(ప్రభ న్యూస్ బ్యూరో) శ్రీకాకుళం, ఆగష్టు 12: మాధక ద్రవ్యాల దుష్ప్ర భావాలపై యువతకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని, యువతపై మాదకద్రవ్యాల ప్రభావం పడకుండా వాటి నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలని అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.


సోమవారం స్థానిక ప్రభుత్వ పురషుల డిగ్రీ కళాశాలలో నాష ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎం బిఏ) కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం, అవగాహన కార్యక్రమాలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లవలసింది విద్యార్థినీ, విద్యార్థులన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా వారు ఉండాలన్నారు. మాదకద్రవ్యాల వాడకం వలన జీవితం నాశనమవుతుందని, సమాజంలో గుర్తింపు కోల్పోతారన్నారు. ఎన్పిడిఎస్ యాక్టులతో పేరు నమోదైతే సొసైటీలో ఉనికి కోల్పోతారన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వలన సామాజిక,, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, అందుకే దేశభవిష్యత్తును కుంగదీసే మాదకద్రవ్యాలను పకడ్బందీగా అరికడదామన్నారు. కార్యక్రమంలో కళాశాలల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి, మాధక ద్రవ్యాల నివారణ,దుష్ప్ర భావాలపై అవగాహన కల్పించే నినాదలు చేశారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఆహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ, మాధక ద్రవ్యాల నివారణ అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని ఇందుకు అందరూ సహకరించాలన్నారు.

- Advertisement -

శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ… కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహణ ముఖ్య ఉద్దేశం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిందని, ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని తెలియచేస్తూ, స్వాతంత్ర సమరయోధుల పోరాటం వివరించారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ మాట్లాడుతూ… నాష ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ శాఖ, భారత ప్రభుత్వం వారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈరోజు జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, వ్యవసాయ కళాశాలలలో సామూహిక ప్రతిజ్ఞ చేసి, మొక్కలు నాటే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ దుర్గాప్రసాద్, డివిఇఓ తవిట నాయుడు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వి.ఎస్ సత్యనారాయణ, ఎన్సిసి క్యాప్టెన్ డా, వై పోలి నాయుడు, డీఎఫ్ఓ ప్రతినిధి నాగేంద్ర రావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. ఆర్ శ్రీనివాస్ పాత్రు, ఆర్.వెంకట్రావు, నారాయణ, శ్రీ చైతన్య, తిరుమల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ క్యాండెట్స్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement