Tuesday, January 28, 2025

SKLM | రక్తదానం.. మరొకరికి ప్రాణదానం : ఎస్పీ తుహిన్ సిన్హా

కశింకోట, అక్టోబర్28 (ఆంధ్రప్రభ) : రక్తాన్ని కృత్రిమంగా సృష్టించలేమని.. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానమ‌ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. సోమవారం మండల కేంద్రమైన కశింకోట గ్రామంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక సీఐ అల్లు స్వామి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రక్తదానం అన్ని దానాల్లోకెల్లా మిన్న అన్నారు. ఎందుకంటే… ప్రాణాపాయస్థితిలో వున్న వ్యక్తికి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడడమంటే… అంతకన్నా పరోపకారం ఏముంటుందని అన్నారు.

అన్నదానం, విద్యాదానం చేయాలన్నా ప్రాణమున్నంత వరకే మనిషికే చేస్తామ‌న్నారు. అలాంటి ప్రాణాలనే నిలబెట్టే మహత్తర దానం రక్తదానం అన్నారు. రక్తదానం సేవ మాత్రమే కాదు ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలన్నారు. సమయానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేస్తే మానవత్వమే మీకు పాదాభివందనం చేస్తుందన్నారు. ఈ రక్తదానం శిబిరంలో 97మంది రక్తం ఇచ్చి ఆదర్శంగా నిలిచారు. ముందుగా అనకాపల్లి డీఎస్పీ అప్పారావు రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన ఆటో డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, పోలీసులను ఎస్పీ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement