Friday, November 22, 2024

నిత్యం అప్రమత్తంగా ఉండాలి – డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం- కరోనా సెకండ్ వేవ్ కారణంగా జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో తదనంతర పరిణామాలపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ జిల్లా కలెక్టర్ జే నివా స్ తో సమీక్షించారు. అమరావతిలో ఉన్న ఆయన ఫోన్ లో సుమారు 15 నిమిషాల పాటు కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం అనుసరిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆదివారం ఒక్కరోజే తొమ్మిది వందల పైచిలుకు కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోందని, కోవిడ్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కృష్ణదాస్ ఈ సందర్భంగా ఆదేశించారు. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని విస్తృతంగా ప్రచారం చేయాలని, మాస్కు శానిటైజర్, ఆరడుగుల యడం వంటి అంశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించేలా చేయాలని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ సారథ్యంలో వ్యాక్సినేషన్ విషయంలో దేశంలోనే ప్రధమ స్థానం సాధించడం సమర్థులైన మీ లాంటి యంత్రాంగం వల్లనే సాధ్యమైందని అభినందించారు. 104 కాల్ సెంటర్ కు విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రైవేటు ఆసుపత్రులపై ఆరోపణలు వస్తున్నందున టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కృష్ణ దాస్ సూచించారు.
కలెక్టర్ జే.నివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు జిల్లాలో ముఖ్య అధికారులును నోడల్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. టాస్క్ ఫోర్స్ కూడా పని చేస్తుందని అన్నారు. జిల్లా కేంద్రం లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని చాలా చోట్ల మినీ కంటెంట్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని, ఇంకా పెద్ద మార్కెట్ నుంచి 80 అడుగుల రోడ్డు తరలించామని, గ్రీవెన్స్ రద్దు చేశామని, కోవిడ్ ఆస్పత్రులు అన్నిటినీ సిద్ధం చేశామని, ప్రభుత్వం నుంచి కూడా వ్యాక్సిన్ చేరుకుంటుందని వివరించారు. యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని చెప్పారు. ఆక్సిజన్, మందుల కొరత లేకుండా తగిన చర్యలను తీసుకున్నట్టు కలెక్టర్ నివాస్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement