శ్రీకాకుళం, జనవరి 19(ప్రభన్యూస్): కులగణనకు సహకరించాలని రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు కోరారు . శుక్రవారం ఉదయం కులగణన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు కోసం జనాభా ప్రాతిపదిక అవసరమైనటువంటి బడ్జెట్ కేటాయింపు, విధాన నిర్ణయాలు అమలు చేయడానికి సామాజిక ఆర్ధిక పరిస్థితులు, అలాగే కులాలు వారీగా ఎంతెంత శాతం ఉన్నారు అన్న వివరాలు ఈ కులగణన ద్వారా తెలుస్తాయన్నారు.
ప్రభుత్వాలు ఆయా కులాల సామాజిక ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కులాల సహాయంతో సామాజిక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు చేయడంలో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, జనాభా ప్రాతిపదికన ఆయా కులాలకు నిధులు కేటాయించు నిమిత్తం ప్రభుత్వానికి ఈ గణన ఉపయోగపడుతుందన్నారు.
పది రోజులు పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయ సిబ్బంది, వాలంటరీ వ్యవస్థ కుటుంబ వివరాలను సేకరించడానికి ఇంటిటింటికి రావడం జరుగుతుందని, కుల గణన సకాలంలో జరిగేలా సిబ్బందికి ప్రజలు సహకరించాలని హితావు పలికారు.