Wednesday, September 18, 2024

SKLM: ప్రకృతి వైపరీత్యాల్లో బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరం… క‌లెక్ట‌ర్

శ్రీకాకుళం, సెప్టెంబర్ 11: పకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సమాజ ఆర్థికాభివృద్ధితో పాటు జిల్లా ఆర్ధిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతైనా అవసరమ‌ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డీసీసీ), బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవలి వరదల వల్ల నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందని, వరదలను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించడం జరిగిందన్నారు. బ్యాంకర్లు సమర్థవంతంగా పనిచేస్తేనే ఆర్థిక వ్యవస్థ మరింత దృఢంగా ఉంటుందన్నారు.

మన జిల్లా మూడు ప్రకృతి వైపరీత్యాలకు గురైందని అందులో 2 తుఫాన్లు, వంశధార, నాగావళి నదులు పొంగినా ఎటువంటి నష్టం కాకపోవడం శుభపరిణామమ‌న్నారు. పాక్షికంగా రోడ్లు, భవనాలు, కెనాల్స్ దెబ్బతిన్నాయ్యన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల నష్టాలపై శాఖల వారిగా ఆరా తీశారు. ముందుగా జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల, డీఆర్డీఏ రెవెన్యూ శాఖల అధికారులు వివరించారు. జిల్లాలో 55గృహాలు దెబ్బతిన్నట్లు నివేదికలు వచ్చాయని వాటిని పరిశీలించాల్సి ఉందన్నారు. అలాగే జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ… కౌలు రైతులకు లోన్లు మంజూరు విధానంపై ఒక వారం రోజుల పాటు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కోరారు.

- Advertisement -

ఎల్డిఎం ఎం.సూర్యకిరణ్ మాట్లాడుతూ… వలస రైతులు సహాయార్థం వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంక్ లను సంప్రదించాలని వారికి బ్యాంకర్లు శత శాతం సహాయ సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్ ఎం హసీబ్, యూనియన్ బ్యాంక్ ఆర్ హెచ్ వెంకట్ తిలక్ మాట్లాడుతూ… రైతులకు బ్యాంకుల ద్వారా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో నాబార్డ్ డీడీఎం రమేష్ కృష్ణ, జిల్లా రెవిన్యూ అధికారి ఎం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కిరణ్ కుమార్, జిల్లా ఉద్యాన అధికారి ఆర్.వి ప్రసాద్, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, పలు బ్యాంకుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement