Saturday, September 7, 2024

AP: హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి…

రాష్ట్రంలోనే ఉత్తమ కళాశాలగా తీర్చిదిద్దా..
ఆధారాలు లేని ఆరోపణ చేయడం తగదు…
ఆర్.ఈ.సి.ఎస్ పాలిటెక్నిక్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఉమాశంకర్…
కశింకోట, జూన్2 (ప్రభ న్యూస్) : హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే తనను విధుల్లోకి తీసుకోవాలని, రాష్ట్రంలోనే ఉత్తమ కళాశాలగా తీర్చిదిద్దడం జరిగిందని, ఆధారాలు లేని ఆరోపణ చేయడం తగదని ఆర్.ఈ.సి.ఎస్ రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్ అన్నారు. శనివారం మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో కశింకోట రాజీవ్ గాంధీ ఆర్. ఇ.సి.ఎస్ పాలిటెక్నిక్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్ తనను తొలగింపు సరైన నిర్ణయం కాదు అని హైకోర్టు ఇచ్చిన తీర్పు పత్రాన్ని మీడియా సమావేశంలో చూపించి మాట్లాడారు.


ఆర్.ఈ.సి.ఎస్ ఎం.డి గా, రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కరస్పాండెంట్ గా వ్యవహరిస్తున్న విశాఖపట్నం జిల్లా సహకార ఆడిట్ అధికారి ఎం. శ్యామలపైన హైకోర్టులో కోర్టు-దిక్కరణ పిటిషన్ దాఖలు (CCSR 17374/2024) కేసు వేశామని, కళాశాల పూర్వపు ప్రిన్సిపల్ డాక్టర్ బి.ఉమాశంకర్ అన్నారు. ఆనాటి ఎం.డి రామ కృష్ణంరాజు, అధికారిక చైర్మన్ ఎం.శ్యామల నిధుల దుర్వినియోగం, అక్రమ ఉద్యోగ భర్తీ వంటి విషయాలలో సహకరించని కారణంగా, అనధికార మౌఖిక ఆదేశాలతో సగం జీతం జారీ చేస్తున్న వారిని నేను ప్రశ్నించడంతో, నాపైన ఆర్థిక ఆరోపణలు మొదలయ్యాయన్నారు. విద్యా చట్టం ప్రకారం, ప్రైవేటు పాలిటెక్నిక్ వ్యవహారాలపై దర్యాప్తున‌కు ఆదేశించే అధికారం, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అధికారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కు ఉంటుందన్నారు.

- Advertisement -

డిప్యూటీ రిజిస్ట్రార్ హోదా కలిగి సహకార శాఖకు చెందిన వీరు, వారికున్న పలుకుబడితో అదే డిప్యూటీ రిజిస్ట్రార్ హోదా గల జిల్లా సహకార అధికారి వారితో సహకార చట్టం ప్రకారం దర్యాప్తు చేయించారని, ఆర్థిక, పాలనా పరమైన అంశాల్లో సంపూర్ణ అధికారం, చెక్కు పవర్ ఎం.డీకి మాత్రమే ఉంటుందన్నారు. అకడమిక్ విషయాలు పర్యవేక్షించే త‌న‌ను బాధ్యుడిని చేస్తూ పక్షపాత నివేదిక సమర్పించేలా కుట్రలు పన్నారని, నివేదికను జనరల్ బాడీ సమావేశంలో చర్చించకుండా 19-4-2021 తేదిన సస్పెండ్ చేశారని ఆరోపించారు.

త‌న‌ను సస్పెండ్ చేసిన అనంతరం, ప్రస్తుత ప్రిన్సిపల్ కె.శివ ఆఫీసు సూపరింటెండెంట్ కె.శివరామ్ ల సహకారంతో ప‌లు చెక్కుల‌ ద్వారా లక్షల రూపాయ‌ల నిధులను కళాశాల నిర్వహణకు సంబంధంలేని పనుల విషయంలో అనుయాయుల పేరున‌ మంజూరు చేసి, కళాశాల నిధులను దుర్వినియోగం చేశారన్నారు. ఇవే కాదు, ఎం.శ్యామల 2019 నుంచి అధికారిక చైర్మన్ గా, 2023 నుంచి అధికారిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా, సంస్థలో ఏ విధంగా నియమాలు ఉల్లంఘించారో, నిధులు దుర్వినియోగం చేశారో, అక్రమంగా ఉద్యోగ భర్తీ, కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చారో, వాటి వెనుక వున్న కారణాలు ఏంటో, వ్యక్తులు ఎవరో ఆధారాలతో సహా రానున్న రెండు మూడు రోజుల్లో మీడియా ద్వారా వెల్లడిస్తానని ఉమా శంకర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement