సోంపేట …- అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మండలంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి అరుదైన గౌరవం దక్కింది. సోమవారం మామిడి పల్లి పంచాయతీ రాజం గ్రామంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో ప్రత్యేక అధికారిని టి.కాంతమ్మ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించారు.. సమాజంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో బెదిరి పోకుండా వాటిని ఎదుర్కోవాల్సిన శక్తిని చాలెంజ్ లకు సిద్ధంగా ఉండాలన్న విషయమై విద్యార్థులకు ఏర్పాటుచేసిన డిబేటింగ్ కార్యక్రమంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దున్న కావ్య మంచి ప్రతిభ కనబరిచింది.. దీంతో ఆ విద్యార్థిని ప్రత్యేక అధికారి తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించారు. అనంతరం 9 వ తరగతి విద్యార్థిని కావ్య కు ఒక్కరోజు ప్రత్యేక అధికారిణిగా విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తూ ప్రత్యేక అధికారి కుర్చిలో కావ్య కు కూర్చోబెట్టి అరుదైన గౌరవాన్ని కల్పించారు. కాగా, కావ్య గురించి ప్రత్యేక అధికారిణి కాంతమ్మ మాట్లాడుతూ, చదువులో మంచి ప్రతిభ కలిగి ఉండడమే కాక ఆట పాటల్లోనూ క్రమశిక్షణ లోనూ ముందంజలో ఉంటుందన్నారు. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ కుమార్తెను చదువు కోసం ఎల్లప్పుడూ తపన పడుతూ ఉంటారని వెల్లడించారు. కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కావ్య తమ పాఠశాలలో మెలుగుతూ పదిమంది విద్యార్థులకు ఆదర్శంగా ఉంటుందనిచ తన కోరిక మంచి సైంటిస్ట్ అవ్వాలని చెబుతూ ఉంటుందని తెలియజేశారు. ఒకరోజు ప్రత్యేక అధికారి కుర్చీలో కూర్చోబెట్టి అపురూపమైన గౌరవం ఇవ్వడం తో ఆ కావ్య సంతోషానికి హద్దులు లేకుండాపోయింది. ఆమెకు అరుదైన అవకాశం రావడంతో తోటి విద్యార్థులు కరతాళధ్వనులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement