శ్రీకాకుళం, అక్టోబర్ 11: న్యూ కాలనీ లో కోటీ 59 లక్షల రూపాయల వ్యయంతో 2.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం శంకుస్థాపన చేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడి సమస్యలు గుర్తించాం అని మంత్రి ధర్మాన అన్నారు. ఈ నేపథ్యాన ఇప్పుడు పనులు మొదలు పెట్టేందుకు ఇక్కడికి వచ్చానని, పనులు నాణ్యతతో చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అలానే త్వరలోనే కలెక్టరేట్ ను పూర్తి చేస్తాం అని,పరిపాలన అంతా ఒకే చోట ఉండేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అన్నారు. వైఎస్సార్ హయాంలోనే దీని రూపకల్పనకు సన్నాహాలు చేశామని గుర్తు చేశారు. తాజాగా నిధులు విడుదల కావడంతో పనులు వేగం పుంజుకోనున్నాయని అన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని రోడ్లు పూర్తి చేసేందుకు, పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, కావలిపాటి రవి శంకర్, జిల్లా అగ్రి బోర్డ్ ఛైర్మన్ శిమ్మా నేతాజీ, అడ్వకేట్లు పాలి శెట్టి మురళి, వినయ్ బుషణ, కొంక్యనా సుభాష్, వైఎస్సార్సీపీ నాయకులు మండవిల్లి రవి కుమార్, పొన్నాడ రిషి,న్యూ కాలనీ స్థానికులు చక్రవర్తి, లంక గాంధీ, పి నగేష్, బి.జనదనన్, కె.శ్రీను, కె.సత్యనారాయణ, వి.వేణు, ఏపి రాము, టి వైకుంటరావు తదితరులు పాల్గొన్నారు.