Monday, November 18, 2024

శ్రీసిటీ సేఫ్టీ, సెక్యూరిటీలకు మోడల్ గా చేయాలి : తిరుపతి జిల్లా ఎస్పీ

శ్రీసిటీ రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి : విదేశీ పెట్టుబడిదారులు ఎక్కువగా ఉన్న పారిశ్రామిక వాడ అయినా శ్రీసిటీ సెజ్ ప్రాంతాన్ని ‘సేఫ్టీ & సెక్యూరిటీ’ లో ఆదర్శంగా ఉంచాలన్న లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపు నిచ్చారు తిరుపతి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి పిలుపు నిచ్చారు జిల్లా పరిధిలోని గూడూరు, నాయుడుపేట, శ్రీసిటీ, శ్రీకాళహస్తి సబ్‌డివిజన్‌ల పోలీసు అధికారుల సమావేశాన్ని ఆయన సోమవారం మధ్యాహ్నం శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో నిర్వహించారు. వారికి స్వాగతం పలికిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఇటువంటి ఉన్నత స్థాయి సమావేశానికి వేదికగా శ్రీసిటీని ఎంచుకోవడం తాము గౌరవంగా భావిస్తున్నామని అన్నారు.. ఆ పై జరిగిన సమావేశంలో ఈ ప్రాంతంలో నేరాలు, సాధారణ శాంతిభద్రతలు, భద్రత, విజిలెన్స్‌పై ఎస్పీ వెంకటరమణా రెడ్డి సమీక్ష జరిపారు.

ఆయా ప్రాంతాల్లో నేర నిరోధక తనిఖీలు నిర్వహించాలని, వివిధ ముఠాల చుట్టూ ఉచ్చు బిగించాలని ఆదేశించారు.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అధికారులకు సూచనలు చేస్తూ ఫిర్యాదులతో పోలీస్‌స్టేషన్‌లకు వచ్చే వారితో మంచిగా ప్రవర్తించాలని కోరారు. అక్రమ ఇసుక తవ్వకాలు, అక్రమ మద్యం వ్యాపారం, మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ చేయాలని, అవసరమని భావించిన ప్రాంతాలలో బీట్‌ల పునర్వ్యవస్థీకరణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

శ్రీసిటీ సమీపంలోని తమిళనాడు సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పేకాట క్లబ్‌ లను గురించి ప్రస్తావించిన ఎస్పీ, వాహనాల తనిఖీలు నిర్వహించడం ద్వారా వారి కదలికలను నియంత్రించాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు బిహెచ్ విమలకుమారి, కులశేఖర్, డీఎస్పీలు సురేంద్ర రెడ్డి (స్పెషల్ బ్రాంచ్), జగదీష్ నాయక్ (శ్రీసిటీ), రాజగోపాల్ రెడ్డి (నాయుడుపేట), విశ్వనాథ్ (శ్రీకాళహస్తి), సూర్యనారాయణరెడ్డి (గూడూరు), పలువురు సీఐలు, ఎస్సై లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement