Tuesday, September 17, 2024

Sricity CBN – నేటి శ్రీ సిటీ లో చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – తిరుపతి – ఏపీ సీఎం నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన పలు పరిశ్రమలను ప్రారంభించడంతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలకు శంకుస్థాపన చేస్తారు.. ఒకేరోజు 15 కంపెనీలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు.

మంచిరోజులు వచ్చాయి.

పెట్టుబడుల కోసం కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి. మరోవైపు పలు కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభిచేందుకు సిద్ధమయ్యాయి. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు తిరుపతి జిల్లాలో నేడు పర్యటించనున్నారు.

ఉదయం ఉదయం 11 గంటలా 40 నిమిషాలకు విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం చంద్రబాబు, హెలికాప్టర్‌ ద్వారా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీకి వెళతారు..

- Advertisement -

.శ్రీసిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2 వేల 740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. మరో 1,213కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది.

అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జికెమ్‌, ఇజ్రాయిల్‌కు చెందిన నియోలింక్‌, జపాన్‌కు చెందిన నైడిక్‌, ఓజెఐ ఇండియా ప్యాకేజ్‌, జర్మనీకి చెందిన బెల్‌ పరిశ్రమలతో పాటు భారతదేశానికి చెందిన అడ్మైర్‌, ఆటోడేటా, బాంబేకోటెడ్‌ స్పెషల్‌ స్టీల్స్‌, ఈప్యాక్‌, ఇఎస్‌ఎస్‌కెఏవై, ఎవర్‌షైన్‌, జేజీఐ, త్రినాత్, జెన్‌లెనిన్‌ సంస్థలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

చైనాకు చెందిన ఎన్‌జీసీ, బెల్జియంకు చెందిన వెర్మేరియన్‌, జపాన్‌కు చెందిన ఏజీ ఆండ్‌ పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్‌కు చెందిన రెండు పరిశ్రమలు, యూఏఇ, సింగపూర్‌లతో పాటు భారతదేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకోనున్నారు.

శ్రీసిటీలో పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలోని సోమశిల సాగునీటి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించనున్నారు. తిరిగి సాయంత్రం ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement