శ్రీ సత్యసాయి బ్యూరో – (ఆంధ్రప్రభ):శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్ల బొమ్మనపల్లి గ్రామం సమీపంలో చోటు చేసుకున్న అత్తా కోడలు పై గ్యాంగ్ రేప్ నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వి రత్న మంగళవారం తెలిపారు. హిందూపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో చిలమత్తూరు మండలం నల్ల బొమ్మనపల్లి వద్ద గల ఆర్ఎన్ పేపర్ మిల్లు వాచ్మెన్ కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పేపర్ మిల్లు వద్దకు వెళ్లిన ఆరుగురు నిందితులను గుర్తించి ఎవరని ప్రశ్నించగా వాచ్మెన్ అతని కుమారుని మారుణాయుదాలతో బెదిరించి, బంధించి వారి భార్యలు అనగా అత్తా కోడలు పై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన విషయం తెలిసిందే.
గ్యాంగ్ రేప్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత అదేవిధంగా రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ వి. రత్నకు ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. దీంతో జిల్లా ఎస్పీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని, నాలుగు టీములు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, 48 గంటల్లో నిందితులను అరెస్టు చేశారు. నిందితులంతా పాత నేరస్తులని పైగా గంజాయి, మత్తు పదార్థాల కేసులు, అదేవిధంగా అత్యాచారాలు, హత్య కేసులలో నిందితులని తేలింది.