క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమన్న హైకోర్టు
వెంటనే విధులలోకి తీసుకోవాలని ఆదేశం
48గంటల్లో పదవీ విరమణ చేయనున్న ఏబీ
సస్సెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇస్తుందా అనే దానిపై ఉత్కంఠ
అమరావతి: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. మూడు వారాల క్రితం ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని తెలిపింది. దీంతో క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.
అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, ఏబీ వెంకటేశ్వరరావు రేపు పదవీ విరమణ చేయనున్నారు… విధి నిర్వహణలో ఉండగా రిటైర్ కావాలని ఆయన భావిస్తున్నారు.. హైకోర్టు తీర్పుతో ఇవాళ ఆయనకు తిరిగి బాధ్యతలు అప్పగించినట్లయితే ఏబీ ఆశ నెరవేరుతుంది.. ఈ తీర్పుపై కూడా ప్రభుత్వం అప్పిల్ కు వెళ్లినట్లయితే సస్పెన్షన్ లో ఉండగానే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది..