Tuesday, November 19, 2024

Sports – హ‌నుమ విహారికి అండ‌గా చంద్రబాబు, షర్మిల, పవన్ కల్యాణ్

విజ‌య‌వాడ – ఆంధ్ర క్రికెట్ లో రాజకీయ జోక్యం ఎక్కువయిందని భవిష్యత్తులో ఏపీ తరపున ఆడబోనని హనుమ విహారి చేసిన ప్ర‌క‌ట‌న సంచలన సృష్టించింది.. రాజకీయ నేత కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని విహారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట తాను ఉండలేనని స్పష్టం చేశాడు. ఇక‌పై ఎపికి ఆడ‌లేన‌ని చెప్పాడు.. ఈ నేపథ్యంలో హ‌నుమ విహారికి అండ‌గా తెలుగుదేశం,జ‌న‌సేన‌. కాంగ్రెస్ పార్టీలు అండ‌గా నిలిచాయ‌.. క్రీడ‌ల‌లో రాజ‌కీయ జోక్యాన్ని ఈ మూడు పార్టీలు తీవ్రంగా ఖండించాయి.. భార‌త్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క్రీడాకారుడికి వైసిపి ప్ర‌భుత్వం అందిస్తున్న బ‌హుమానం ఇదేనా అంటూ మండిప‌డ్డాయి ..

జ‌గ‌న్ ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు ప‌రాకాష్ట …చంద్రబాబు

వైసీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటని చంద్రబాబు విమర్శించారు. హనుమ విహారి ఒక తెలివైన భారత అంతర్జాతీయ క్రికెటర్ అని.. ఆయన ఏపీ తరపున ఎప్పటికీ ఆడబోనని ప్రమాణ చేసే స్థాయికి టార్గెట్ చేశార‌ని దుయ్యబట్టారు. ఈ మేరకు చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ లో ట్విట్ చేశారు.. ” హనుమా, మీరు దృఢంగా ఉండండి… క్రికెట్ పట్ల మీకున్న చిత్తశుద్ధి, కమిట్మెంట్ మీ గురించి ఎంతో గొప్పగా చెపుతాయి. ఈ అన్యాయమైన చర్యలు ఏపీకి, మన ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించవు.. మేము మీకు ఎప్పుడూ అండగా ఉంటామని… మీకు న్యాయం జరగేలా చూస్తాం” అంటూ భరోసా ఇచ్చారు.

జ‌గ‌న్ అన్నా… ఇంత‌కంటే సిగ్గుచేటు ఏమ‌న్నా ఉందా…షర్మిల

మీ ప్ర‌తాపం క్రీడ‌ల‌లో సైతం చూపుతున్నారంటూ మండి ప‌డ్డారు ఎపి కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల‌.. ఈ మేర‌కు ఆమె ట్వ‌ట్ చేస్తూ,.
“ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు, ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను, అధికారమదాన్ని చూపుతున్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైసీపీ నేతలు, అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? ఇది ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా? ఈ విషయంపై వెనువెంటనే నిస్పాక్షికమైన విచారణ జరగాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది. క్రీడలపై వైసీపీ క్రీనీడలు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకెన్ని దిగజారుడు ఆటలు ఆడతారు వీళ్ళు?” అంటూ పేర్కొన్నారు.

- Advertisement -

ద‌ళితుడైనా, క్రికెట‌రైనా అణిచి వేయ‌డ‌మే జ‌గ‌న్ ధ్యేయం…పవన్ కళ్యాణ్

త‌మ మాట విన‌ని, త‌మ‌కు విధేయుడిగా ఉండ‌ని వారిని అణిచివేయ‌డ‌మే జ‌గ‌న్ ధ్యేయ‌మంటూ జ‌న‌సేన విరుచుకుప‌డింది.. దేశానికి , రాష్ట్రానికి ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకొచ్చిన హ‌నుమ విహారిని రాష్ట్రం నుంచి త‌రిమివేయ‌డం వికృత‌చ‌ర్య‌గా అభివ‌ర్ణించింది..ఈ మేర‌కు ట్విట్ చేస్తూ “తమ కింద బ్రతకకుంటే అణచివేయడం లేదా చంపేయడమే వైసీపీ విధానం!అది ఒక సామాన్య దళిత డ్రైవర్ అయినా…భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెటర్ అయినా..!! జ‌గ‌న్ కు ఒక్క‌టే ” అని పేర్కొంది.

” జగన్‌మోహన్‌ రెడ్డి గారూ! మన ఆంధ్రా క్రికెట్ టీమ్ కెప్టెన్‌ని రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానించినప్పుడు.. ‘అడుదాం ఆంధ్రా’ లాంటి కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయల సొమ్ములు ఖర్చు చేసి లాభమేంటి? ప్రియమైన హనుమ విహారి గారూ…. మీరు రాష్ట్రానికి, దేశానికి ఛాంపియన్ ప్లేయర్. మీ విశిష్ట సేవలతో ఆంధ్రలోని చిన్న పిల్లల్లో స్ఫూర్తిని నింపి, క్రీడాకారులను ఉత్తేజపరిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. తెలుగువారిగా, క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే వ్యక్తులుగా మీకు జరిగిన అన్యాయానికి…. మన రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్ మీ పట్ల చూపిన వివక్షతకు మేము చింతిస్తున్నాము. మీకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ క్రికెట్‌ అసోసియేషన్‌తో మీరు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరపున ఆడతారని నేను విశ్వసిస్తున్నానని” పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో స్పష్టం చేశారు.

రెండు నెల‌లు ఓపిక ప‌ట్టండి…రెడ్ కార్పెట్ తో స్వాగ‌తం ప‌లుకుతాం…

అధికార పార్టీ రాజకీయ జోక్యం కారణంగా ఒక ప్రముఖ క్రికెటర్ అయిన హనుమ విహారి చేదు నిష్క్రమణపై తాను ఆశ్చర్యపోయానని చెప్పారు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. రెండు నెలల్లో హనుమ విహారి ఏపీ తరపున ఆడేందుకు తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. విహారికి, ఏపీ టీమ్ కు తాము రెడ్ కార్పెట్ పరుస్తామని,వచ్చే రంజీ ట్రోఫీని ఏపీ గెలుపొందేందుకు అవసరమైన సహాయాలన్నింటినీ అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement