తిరుపతి, ప్రభన్యూస్ బ్యూరో (రాయలసీమ ) : విరాట్ కోహ్లీ ని స్ఫూర్తి గా తీసుకుని క్రికెట్ లో ఎదిగిన తాను దేశ ప్రతిష్ట ను నిలబెట్టే విధంగా ఆడటమే లక్ష్యం గా పెట్టుకుని కృషి చేస్తానని భారత క్రికెటర్ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవలి మొదటి టెస్ట్ సీరియస్ లోనే ఆస్ట్రేలియా గడ్డపై తొలి సెంచరీ సాధించిన నితీష్ తిరుమలేశుని దర్శనానికి నిన్న వచ్చారు.
.
నిన్న శ్రీవారి మెట్టు మార్గంలో మోకాళ్ళ తో మెట్లు ఎక్కి తిరుమల కు వెళ్లి ఈరోజు వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు.
ఆపై తిరుపతి లోని ఏసీఏ ఇన్ఫాస్ట్ట్రక్చర్ చైర్మన్ విజయ్ కుమార్ ను కలిసేందుకు ఆయన ఇంటికి వచ్చారు.ఆ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆశీస్సులతో భారత క్రికెట్ జట్టులో మరింతగా రాణించి దేశానికి గొప్ప పేరు తీసుకొస్తానన్నారు.
విరాట్ కోహ్లీ స్ఫూర్తితో క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్నానని, ఎంతో కృషి పట్టుదలతో భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను టెస్ట్ క్రికెట్ లో ఆరంగేట్రం చేసిన మొదటి సీరియస్ మూడవ టెస్టులో ఆస్ట్రేలియాపై సెంచరీ చేయడం ఎంతో తృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
ముందు ముందు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో రాణిస్తూ భారతదేశనికి గొప్ప పేరు తీసుకొస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.క్రికెట్ పై ఆసక్తి ఉన్న ప్రతి క్రికెట్ క్రీడాకారుడు కృషి, పట్టుదలతో ఎంతో రాణించాలని అప్పుడే జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో స్థానం సంపాదించగలమని సూచించారు.
ఆపై విజయకుమార్ తో క్రికెట్ క్రీడ కు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి గురించి,జిల్లా స్థాయిలో మరిన్ని క్రికెట్ లీగ్ మ్యాచ్ లు,సబ్ సెంటర్స్ ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అభివృద్ధి చేయడం గురించి చర్చించారు. ఇందుకు అనుగుణంగా ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాధ్(చిన్ని),కార్యదర్శి సాన సతీష్ బాబు రూరల్ క్రికెట్ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందు కోసం ఎంత నిధినైనా వెంచించడానికి సిద్ధంగా ఉన్న విషయాలను నితీష్ కుమార్ రెడ్డి కి విజయ్ కుమార్ వి వరించారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మూర్తి,సెక్రటరీ రవి జాయింట్ సెక్రెటరీ సతీష్ యాదవ్,జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు,క్రీడాకారులు పాల్గొన్నారు.