Friday, November 22, 2024

Spl Story – క‌ల్యాణ ఘ‌డియలకు వేళాయె … రెండు రోజులలో 20వేల వివాహాలు

( ఆంధ్రప్రభ స్మార్ట్, అన్నవరం) క‌ల్యాణ ఘ‌డియలకు వేళాయె… ఇక ఊరూర పెళ్లిళ్ల సందడే సందడి. భాజాభజంత్రీలు.. వేద మంత్రాల ఘోష.. మాంగల్యం తంతునా శుభగే.. మంత్రోచ్చరణ తరుణంలో.. మంగళవాయిద్యాల మోత.. బలే బలే పెళ్లి సందళ్లకు వేళైంది. శ్రావణ మాసంలో రేపు, ఎల్లుండు (గురు, శుక్రవారాలు) మంచి ముహూర్తాలు ఉండ‌టంతో వేలాది జంట‌లు ఏకం కానున్నాయి.. ఒక్క ఏపీలోనే ఈ రెండు రోజుల్లో సుమారు 20 వేల పెళ్లిల వ‌చ్చే రెండు రోజుల‌లో జ‌ర‌గనున్న‌ట్లు చెబుతున్నారు.. పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తోంది. క‌ళ్యాణ మండ‌పాలు, గెస్ట్ హౌజ్ లు, పెళ్లి సందడిలో కిట‌కిట‌లాడుతున్నాయి.

అన్నవరం స‌త్య దేవుని స‌న్నిధిలో..

ఇక ఒక్క అన్నవరం దేవస్థానంలోనే ఈ రెండ్రోజుల్లో 200కు పైగా జంటలు ఒక్కటి కాబోతున్నాయి. సత్య, రత్నగిరులపై కల్యాణ మండపాలు, ఇతర ప్రదేశాల్లో పెళ్లిళ్లు అధికంగా ఎక్కువగా జరుగుతాయి. ఈ నెల 22న 92 జంటలు, 23వ తేదీన 87 జంటలు ఏకం కానున్నాయి. ఆలయ ప్రాంగణాల్లో మరో 30 నుంచి 50 వివాహాలు జరుగుతాయని అంచనా. సత్యగిరిపై విష్ణుసదన్‌లో 36 హాళ్లు ఉన్నాయి. ఉచిత కల్యాణ మండపాల్లో ఒకేసారి 28 వివాహాలు చేసుకునే అవకాశముంది. రత్నగిరిపై ఖాళీ ప్రదేశాలు, సీతారామ సత్రం, పాత, కొత్త సెంటినరీ కాటేజీల వద్ద పలు ముహూర్తాల్లో వివాహాలు జరుగుతాయి.

- Advertisement -

సిఫార్సుల తాకిడి

ముహూర్తాల నేపథ్యంలో వసతి గదులకు డిమాండ్‌ నెలకొంది. కొండపై సుమారు 450 గదులు ఉన్నప్పటికీ ఇవి చాలని పరిస్థితి. ఇప్పటికే 30 శాతం గదులు ముందస్తుగా కేటాయించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి సిఫార్సు లేఖలు పెద్దసంఖ్యలో వచ్చాయి. దీంతో ఇబ్బందులు లేకుండా అధికారులు గదులను సర్దుబాటు చేస్తున్నారు. కాగా రత్నగిరిపై వివాహ గుమ్మటాలు (అలంకరణ ఏర్పాట్లు) వేసుకునే వారి నుంచి దేవస్థానమే ప్రస్తుతానికి రుసుము వసూలు చేస్తుంది. వివాహాలు చేసుకునేవారు మండపాలు వేసుకుంటే నిర్ణీత సొమ్మును తీసుకొని రసీదు ఇస్తారు. కానీ…రాజకీయ నేత సిఫార్సు లేఖలతో కొత్త జంటలు ప్రత్యక్షమ వుతుంటే.. ఎవరికి ఎక్కడ బస ఏర్పాట్లు చేయాలో అర్థం కాక ఆలయ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement