Tuesday, November 26, 2024

Spl Story – పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ – కేటాయింపులు ల్లేవ్… అనుమ‌తులు ల్లేవ్ …

అమరావతి, ఆంధ్రప్రభ: తెలంగాణలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు – రంగారెడ్డి పథకంపై నేషనల్‌ గ్రీన్‌ -టైబ్యునల్‌తో పాటు- సుప్రీంకోర్టుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అఫిడవిట్‌ రూపంలో కీలక నివేదిక అందించినట్టు- తెలిసిం ది. తాగునీటి పథకం పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీ సాగునీటి పథకాన్ని నిర్మి స్తోందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యం లో ఇటీ-వల సుప్రీంకోర్టు బోర్డుకు నోటీ-సులు జారీ చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు అఫిడవిట్‌ దాఖలు చేసినట్టు- తెలిసింది. 7.15 టీ-ఎంసీల తాగునీటి తరలింపు నకు లిప్టnులు, కాల్వలు, నిల్వ సామర్థ్యానికి మించి జలాశ యాల నిర్మాణాలు ఉన్నాయని బోర్డు వెల్లడించినట్టు- సమాచారం. అనుమతులు లేకుండా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ కడప జిల్లాకు చెందిన వెంకటయ్యతో పాటు- మరికొందరు రైతులు ఎన్జీటీ-లో పిటిషన్‌ దాఖలు చేయగా ఏపీ ప్రభు త్వం కూడా ఆ వ్యాజ్యాల్లో ఇంప్లీడ్‌ అయింది. రాయ లసీమ ఎత్తపోతల పథకాన్ని నిలుపు దల చేసే దాకా తెలంగాణ ప్రభుత్వం ఎలా వెంటాడిందో పాలమూరు-రంగారెడ్డిపైనా ఏపీ ప్రభుత్వం అదే వైఖరి అవలంబించి నేషనల్‌ గ్రీన్‌ -టైబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆ తరువాత సుప్రీం కోర్టులోనూ పిటిషన్‌ దాఖలు చేసింది. నేషనల్‌ గ్రీన్‌ -టైబ్యునల్‌ గతంలో జారీ చేసిన ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖతో పాటు- కృష్ణా బోర్డు అధికారులతో కూడిన సంయుక్త కమిటీ- ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. తమ పరిశీలనలో వెల్లడైన విషయాలకు ఇపుడు ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితులను క్రోడీకరించి కృష్ణా బోర్డు అఫిడవిట్‌ రూపంలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించినట్టు- తెలిసింది.

రోజుకు 2.07 టీ-ఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీ-ఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసే సామర్దం ఉన్న పైపులైన్‌ నిర్మాణ పనులు కూడా చేపట్టినట్టు- గతంలో ఎన్జీటీ-కి సంయుక్త కమిటీ- నివేదిక సమర్పించింది. పర్యావరణ, అటవీ అనుమతుల ఉల్లంఘనలు ఉన్నాయనీ, దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి 3.7 కోట్ల జరిమానా విధించాలని కూడా సంయుక్త కమిటీ- -టైబ్యునల్‌కు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలుపుదల చేస్తూ ఎన్జీటీ- ఉత్తర్వులు జారీ చేసింది.

కృష్ణాలో కేటాయింపులు లేవు..
తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అనుమతులు లేకపోగా కృష్ణాలో ఒక్క చుక్క నీటి కేటాయింపులు కూడా లేవని ఏపీ వాదిస్తోంది. కృష్ణా జల వివాదాల -టైబ్యునల్‌ -1, -టైబ్యునల్‌-2 ముందు ఎప్పుడూ పాలమూరు-రంగారెడ్డి ప్రస్తావన రాలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లోనూ ఈ ప్రాజెక్టుకు చోటు- లేదు. కేంద్ర జలశక్తి విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోనూ పాలమూరు-రంగారెడ్డి అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలోనూ పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని వెల్లడిస్తూ ఏపీ ప్రభుత్వం రెండు అఫిడవిట్లను ఎన్జీటీ-లో దాఖలు చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌ ప్రకారం తెలంగాణలో నె-్టట-ంపాడు, కల్వకుర్తి తప్ప నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టయినా కొత్తదే అవుతుంది. కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు కేటాయింపులు, అనుమతులు కావాలి. అందువల్లనే పాలమూరు-రంగారెడ్డిని తాగునీటి ప్రాజెక్టుగా చెబుతూ సాగునీటి ప్రాజెక్టుకు అవసరమైన అన్ని పనులు చేపడుతోంది. శ్రీశైలం నుంచి 90 టీ-ఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డి పథకం కింద ఉన్న ఆయకట్టు-కు తరలించేందుకు ప్రయత్నించటం చట్ట విరుద్ధం..రాయలసీమ జిల్లాలతో పాటు- ప్రకాశం, నెల్లూరు జిల్లాల తాగునీటి ప్రయోజనాలకు విఘాతంగా మారనున్న పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు డీపీఆర్‌ పరిశీలనార్హత లేదని ఏపీ వాదిస్తోంది, ఈ నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డి పథకం మనుగడకు తాజాగా కృష్ణా బోర్డు సమర్పించిన నివేదిక కీలకం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement