Monday, November 18, 2024

Spl Plants: అంబానీ ఇంటికి కడియం​ మొక్కలు.. రేటంతో తెలుసా!

అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ ఇంటి సుందరీకరణకు ఆంధ్రపదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నుంచి మొక్కలు బయలు దేరి వెళ్లాయి. కడియం-వీరవరం రోడ్డులోని గౌతమీ నర్సరీ రైతు మార్గాని వీరబాబు నర్సరీ నుంచి రెండు ఆలీవ్ మొక్కలను అంబానీ కంపెనీల ప్రతినిధులు కొనుగోలు చేశారు. గుజరాత్ రాష్ట్రం జామనగర్ లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో ఈ రెండు మొక్కలు కనువిందు చేయనున్నాయి.

సువిశాలమైన గార్డెన్లో ఈ మొక్కలు ఉంటే వచ్చే అందమే వేరు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ మొక్కల రేటు ఎంతో తెలుసుకోవాలని ఉంది కదూ… ఒక్కొక్క మొక్క పాతిక లక్షల రూపాయలు. అంటే రెండు మొక్కలు అర కోటి. అలాగని ఇదంతా నర్సరీ రైతు లాభమే అనేసుకోకండి. వీటిని స్పెయిన్ నుంచి ఓడలో ప్రత్యేక కంటైనర్ ద్వారా లక్షలాది రూపాయల పెట్టుబడితో తీసుకొచ్చారు.

అనంతరం వాటికి గోదావరి మట్టి, నీళ్లతో ప్రత్యేక పోషణచేపట్టి కొత్త రూపురేఖలు సృష్టించిన తర్వాత ఇంత రేటు పలికింది. ఈ అరకోటి రూపాయలతో అంబానీ ఇంటికి ఈ మొక్కలు వెళ్లిపోవండోయ్. ఈ రెండు మొక్కలు కోసం ప్రత్యేక ట్రాలీని ఏర్పాటు చేశారు. దాని కిరాయి సుమారు మూడున్నర లక్షలు ఉంటుంది. ఈ మొక్కల రేటు మాటెలా ఉన్నా చాలా కాలంగా పెంచిన మొక్కలు తరలిపోతుంటే ఆ నర్సరీ రైతు వీరబాబే గాక ఆ మొక్కలతో అనుబంధం ఉన్న ఉద్యోగులు, కూలీలలో ఏదో తెలియని భాద కన్పించింది. ట్రాలీపై మొక్కలను ఏర్పాటు చేసిన తరువాత వారంతా ఇలా ఫొటోలు తీయించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement