Tuesday, November 19, 2024

AP | శ‌ర‌వేగంగా విమానాశ్రయ అభివృద్ధి : ఎంపీ కేశినేని

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో ) : అమరావతి రాజధానిలో ఉన్న ఏకైక విమానాశ్రయ సంపూర్ణ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని, పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్ పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం శనివారం నిర్వహించగా ఏఐసి చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలసౌరి తో కలిసి వైస్ చైర్మన్ ఎంపీ కేసినేని శివనాద్ పాల్గొన్నారు.

సమావేశ అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త టెర్మినల్ ను అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కల్పించవలసిన సదుపాయాలతో పాటు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగం పెంచే దిశగా తీసుకోవలసిన చర్యలపై చర్చించామన్నారు.

కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన విమాన సర్వీసులన్నీ ఫుల్ ఆకుపైన్సితో నడుస్తున్నాయని చెప్పిన ఆయన దేశంలోని పుణ్యక్షేత్రాలు వాణిజ్య నగరాలకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రయాణికులు అవసరాల దృష్ట్యా క్యాబ్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, బస్ సర్వీసులను కూడా నడిపే విధంగా ప్రతిపాదనలు చేశామన్నారు.

కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత గన్నవరం నుండి దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు పెరగడంతో పాటు కనెక్ట్ కనెక్టివిటీ కూడా పెద్ద స్థాయిలో పెరిగింది అన్నారు జూన్ తర్వాత అందుబాటులోకి వచ్చే కొత్త టెర్మినల్ ప్రయాణికులు అవసరాలు తీర్చడమే కాకుండా విదేశాల నుంచి రాబోయే అతిధులు మెచ్చే విధంగా ఉండబోతున్నట్లు తెలిపారు.

ఈ విమానాశ్రయాన్ని దేశంలోని 10 మొదటి 10 విమానాశ్రయాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ విమానాశ్రయంలో తాగునీటి సమస్య ఉందని ఆ సమస్యను తీర్చేందుకు కృష్ణ గోదావరి నీళ్లు తెచ్చే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించామన్నారు.

- Advertisement -

గన్నవరం నుండి దుబాయ్ కి ఎమిరేట్స్ విమాన సర్వీసులు ప్రారంభించాలని ఇప్పటికే కేంద్రమంత్రిని కోరడం జరిగిందని 20 29 నాటికి విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి న్యూయార్క్ కి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించాలనే ఆశయంతో పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ ఎస్పీ ఆర్ గంగాధర్ కమిటీ సభ్యులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement